23-07-2025 12:00:00 AM
తూప్రాన్, జూలై 22 : గుర్తు తెలియని యువకుడిని హత్య చేసినట్లు తూప్రాన్ సీఐ రంగాకృష్ణ తెలిపారు. శివంపేట మండలం మక్దూంపూర్ గ్రామ శివారులోని తూప్రాన్ నుండి నర్సాపూర్ వెళ్లే రోడ్డు పక్కన ఒక గుర్తు తెలియని యువకుని మృతుదేహం లభించినట్లు తెలిపారు. సుమారు 20 నుంచి 25 ఏళ్ళ వయస్సు కలిగి యున్నాడని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తలపైన బండరాయితో బలంగా బాది బట్టలు లేకుండా పడేసి పారిపోయినట్లు తెలిపారు.
మృతుడి శవానికి కొద్ది దూరం లో రెండు వెండి చైన్లు, సిల్వర్ కలర్ వాచ్ ఉన్నాయని, చూడడానికి ముస్లిం వ్యక్తి లాగా కనిపిస్తున్నాడని తెలిపారు. గుర్తు తెలియని ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే తూప్రాన్ సిఐ రంగా కృష్ణ కు, శివంపేట్ ఎస్త్స్ర కి సమాచారం ఇవ్వాలని కోరారు.