23-07-2025 06:07:46 PM
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్..
కామారెడ్డి (విజయక్రాంతి): ఉద్యానవన శాఖ ద్వారా ప్రభుత్వం కల్పిస్తున్న రాయితీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్(District Collector Ashish Sangwan) కోరారు. బుధవారం కామారెడ్డి కలెక్టరేట్లో ఉద్యానవన శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రైతులు ఆయిల్ ఫామ్ సాగుపై మగ్గుచూపుల ఉద్యానవన శాఖ ఆయిల్ పెయిడ్ శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్, రాష్ట్రీయ కృషి వికాస్ యోజన, నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్స్, డ్రిప్పు పథకాల మీద సమీక్ష నిర్వహించారు.
ఉద్యానవన శాఖ ద్వారా వస్తున్న రాయితీలను రైతులకు అధికారులు వివరించి అవగాహన కల్పించాలన్నారు. ఈ సమావేశంలో ఉద్యానవన శాఖ అడిషనల్ డైరెక్టర్ సరోజినీ దేవి కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఉద్యానవన శాఖ అధికారులతో జిల్లాలో ఆయిల్ ఫామ్ సాగుపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జ్యోతి, ఉద్యానవనశాఖ మండల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు,