calender_icon.png 11 December, 2025 | 2:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్య చేసిన వ్యక్తి అరెస్టు

11-12-2025 01:23:39 AM

తూప్రాన్, డిసెంబర్ 10 :తూప్రాన్ పరిధిలోని లింగారెడ్డిపేట్ బస్టాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి హత్య జరిగిన సంఘటనలో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపిన తూప్రాన్ సిఐ రంగ కృష్ణ తెలిపారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మరావుపేట గ్రామానికి చెందిన ర్యాపని హనుమంతు తన కుటుంబ సమస్యల కారణంగా గత కొంతకాలంగా బస్ స్టాప్లు, రోడ్ల ప్రక్కన స్క్రాప్ సేకరించుకుంటూ జీవిస్తున్నాడు. గత రెండు నెలలుగా తూప్రాన్ టోల్ గేట్ సమీపంలో, హైవే ప్రక్కన దొరికే స్క్రాప్ను సేకరించి లింగారెడ్డిపేట్ బస్టాప్లో రాత్రి గడుపుతున్నట్లు తెలిపారు.

గత ఇరవై రోజులుగా అదే బస్టాప్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి తనతో పాటు పడుకుని, తనకు అడ్డుగా మారుతూ, తన సేకరించిన స్క్రాప్ను దొంగతనంగా తీసుకెళ్లి అమ్ముతున్నాడని నిందితుడు పేర్కొన్నాడు. ఈ కారణంగా అతనిపై తీవ్ర అసహనం పెంచుకొని హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు వివరించాడు. మంగళవారం రాత్రి ఆ వ్యక్తి మద్యం సేవించి నిద్రలోకి జారుకున్న తర్వాత తన వద్ద ఉన్న తాళ్లతో చేతులు, కాళ్లు కట్టవేసి కర్రతో తలపై మోదినా చనిపోకపోవడంతో తాడును గొంతుకు చుట్టి రెండు చేతులతో బిగించి చంపినట్లు ఒప్పుకున్నట్టు చెప్పారు.

తరువాత గుర్తు పట్టకుండా ఉండేందుకు కట్టెలతో తలను తగలపెట్టడానికి మంట పెట్టగా. ఆసమయంలో పెట్రోలింగ్ చేస్తున్న  పోలీసులు గమనించి ప్రశ్నించగా భయపడి మొత్తం ఘటనను వివరిస్తూ నేరాన్ని అంగీకరించినట్లు చెప్పారు.పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో తూప్రాన్ ఎస్‌ఐ శివానందం, పోలీస్ సిబ్బంది ఉన్నారు.