28-11-2025 12:00:00 AM
మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్
కామారెడ్డి, నవంబర్ 27 (విజయక్రాంతి): కామారెడ్డి నియోజక వర్గంలో మొదటి విడతలో జరగనున్న సర్పంచ్ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలలో విజయం సాధించాలని మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. గురువారం కామారెడ్డి నియోజకవర్గంలోని దోమకొండ, మాచారెడ్డి, బిక్కనూర్, రాజంపేట, పాల్వంచ, బిబిపేట్, మండలాల టిఆర్‌ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.
తన స్వగృహంలో జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు ఎండగడుతూ ప్రచారం నిర్వహించాలని అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ప్రజల ముందు పెడుతూ మద్దతు కూడా కట్టాలని సూచించారు ఎక్కడ కూడా అశ్రద్ధ చేయకుండా గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు ప్రతిపక్షంలో ఉన్న ప్రజల పక్షాన పోరాడాలని అన్నారు. ఈ సమావేశంలో సినియర్ నాయకులు ప్రేమ్ కుమార్, మినుకూరి రామ్ రెడ్డి, గోపి గౌడ్, కుంచాల శేఖర్ పార్టీ అధ్యక్షులు బాలచంద్రన్, మధుసూదన్ రావు, బల్వంత్ రావు, రాజా గౌడ్, బాలమని, గూడెం బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.