calender_icon.png 16 August, 2025 | 2:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అత్యవసర పరిస్థితులలో ప్రాణాలు నిలబెట్టడమే నా లక్ష్యం

13-08-2025 12:35:29 AM

- కొరవడిన వసతుల కల్పన కోసం ఆరోగ్యశాఖ మంత్రికి లేఖ రాస్తా

- క్రిటికల్ కేర్ సెంటర్ ను పరిశీలన టీ హాబ్‌లో పరీక్షలు నిల్

- సొమ్ము దాతలది ఫొటోలు సి ఎం రేవంత్ రెడ్డివి

- మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి 

వనపర్తి, ఆగస్టు 12 ( విజయక్రాంతి ) : జిల్లా కేంద్రములో క్రిటికల్ కేర్ సెంటర్ (అత్యవసర వైద్య సేవల విభాగం) నిర్మాణం, ఆధునిక పరికరాలను మంగళవారం మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్థానిక బి.ఆ ర్.ఎస్ శ్రేణులతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు ఒక్క రూ పాయి ఖర్చు లేకుండా సామాన్య పేద ప్రజలకు వైద్యం అందాలన్న సదుద్దేశ్యంతో ఆనా డు కె.సి.ఆర్ మండల స్థాయి,జిల్లా స్థాయి ఆసుపత్రులు అధునూతనమైన పరికరాలతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అందులో భాగంగానే జిల్లా కేంద్రంలో నా హాయంలో రూ 17కోట్లతో క్రిటికల్ కేర్ సెం టర్ ను అధునాతన పరికరాలతో మంజూ రు చేయించడం జరిగిందన్నారు. ఈ క్రిటికల్ కేర్ సెంటర్ లో 50బెడ్సులో ఒకేసారి 50 మందికి అత్యవసర వైద్య సేవలు అందుతా యి అని అదేవిధంగా 25 ఇంటెన్సివ్ కేర్ యూనిట్ బెడ్స్‌తో వైద్యం అందిస్తారన్నారు. 

 టి హాబ్‌లో పరీక్షలు నిల్

 ప్రజలకు అత్యవసర వైద్య సేవలు అందించాలని రూ 2కోట్ల 40లక్షలతో సి.టి స్కాన్ ఏర్పాటు చేశామని ఇందులో 135 పరీక్షలు నిర్వహించడానికి టి డయాగ్నటిక్ హబ్ సెంటర్ మంజూరు చేస్తే ప్రస్తుతం 30, 40పరీక్షలు నిర్వహించడం లేదన్నారు. ఈ విషయం పై జిల్లా కలెక్టర్ తో మాట్లాడి మెరుగైన పరీక్షలు నిర్వహించాలని సూచించడంతో పాటు ప్రభుత్వ జనరల్ ఆసుప త్రిలో కొరవడిన వసతుల,సేవల గూర్చి వై ద్య ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ వ్రాస్తానని ఆయన తెలిపారు..

 సొమ్ము దాతలది ఫొటోలు సీఎం రేవంత్ రెడ్డివి

 వనపర్తి నియోజకవర్గంలో దశాబ్దాలుగా ప్రజల అత్యవసర పరిస్థితుల్లో సేవలు అందించడానికి అంబులెన్సులు అందుబాటులో ఉండేవి కావని అనాటి పరిస్థితులలో మాజీ ఎం.పి రావుల.చంద్రశేఖర్ రెడ్డి ఒక అంబులెన్స్ సమకూర్చినారని తర్వాత తాను మంత్రిగా నియోజకవర్గంలో అన్ని మండలాలకు కొల్లాపూర్, అలంపూర్ నియోజకవ ర్గంలో 9అంబులెన్సులు కొన్ని సి.ఎస్.ఆర్ ఫండ్స్ ద్వారా వ్యక్తిగత సొమ్ముతో, శ్రేయోభిలాషులు, స్నేహితులు, దాతల సహకారంతో సమకూర్చడం జరిగిందని ఆయన వివరించారు.

తాను బాధ్యత వహించి జిల్లా ప్రజల సౌకర్యకోసం సొంతంగా, దాతల సహాయం తో ఏర్పాటు చేస్తే సర్కార్ ఏకానా ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ల ఫోటోలు ముద్రించుకోవడం సిగ్గుచేటు అని ఆయన ఘాటుగా విమర్శించారు.స ర్కార్ నిధులు ఇచ్చి స్టీకర్లు అతికించుకుంటే తప్పులేదు కానీ దాతలు, తాను, శ్రేయోభిలాషులు సమకూర్చిన అం బులెన్స్ లమీద రేవంత్ రెడ్డి ఫోటోలు ముద్రించుకోవడం ని జంగా సిగ్గుచేటైన విషయమన్నారు. నాయకులు గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్, రమేష్ గౌడ్, నందిమల్ల. అశోక్, తదితరులు పాల్గొన్నారు .