calender_icon.png 16 August, 2025 | 3:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గిరిజనుల సమస్యలపై పరిష్కారానికి చర్యలు

13-08-2025 12:33:28 AM

  1. సెంట్రల్ మానిటరింగ్ సిస్టం ద్వారా ప్రతిరోజు పర్యవేక్షణ

అర్హులకు వెదురు సాగు చేసేందుకు అవకాశం

సమన్వయంతో ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలి

గోదాం, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం

కలెక్టర్ కుమార్ దీపక్

దండేపల్లి, ఆగస్టు 12 : గిరిజనుల సమస్యల శాశ్వత పరిష్కారానికి చట్టం ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం మం డలంలోని దమ్మన్నపేట గ్రామంలో గిరిజనుల సమస్యలపై జిల్లా అటవీ శాఖ అధికారి శివ్ అశిష్ సింగ్, డీసీపీ ఎగ్గడి భాస్కర్, మండల తహసిల్దార్ రోహిత్ దేశ్పాండే లతో కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా కలెక్ట ర్ మాట్లాడుతూ ఆర్.ఓ.ఎఫ్.ఆర్. చట్టం ప్రకారం 2005 కంటే ముందు నుంచి పోడుభూములు సాగు చేస్తున్న అర్హులైన గిరిజనులకు పట్టాలు అందించి జీవనాధా రం కల్పించడం జరుగుతుందని తెలిపారు. కొంతమంది గిరిజనులు ప్రస్తుత కాలంలో అటవీభూమిని ఆక్రమించి పోడు వ్యవసా యం చేస్తూ పట్టాలు అడగడం జరుగుతుందని, షెడ్యూల్ తెగలకు కల్పించిన హక్కుల ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ మానిటరింగ్ సిస్టం ద్వారా ప్రతిరోజు పర్యవేక్షించడం జరుగుతుందని, చేపట్టవలసిన చర్యలపై అటవీశాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేస్తుందని కలెక్టర్ తెలిపారు. అర్హులైన గిరిజనులకు అటవీ భూములలో వెదురు సాగు చేసేందుకు అవకాశం కల్పించడం జరుగుతుందని, సాగుకు అవసరమైన మొక్కలు, కూలీల ఖర్చులు ప్రభుత్వం అందించి పంటను విక్రయించుకునేందుకు ఆయా సంస్థలతో ఒప్పందాలు చేయించి గిరిజనులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు తోడ్పాటు అందించడం జరుగుతుంద న్నారు.

పండ్ల మొక్కల పెంపకంపై రైతులకు మెలకువలు అందించి, కూలీల ఖర్చులు, మొక్కలు, సాగునీటిని అందించి పంట దిగుబడిని విక్రయించుకునేలా  ప్రోత్సహిస్తున్నా మన్నారు. జిల్లాలో 5 శాతం ఉద్యానవన పంటల సాగు జరుగుతుందని, జిల్లాలోని దేవునిపల్లి గ్రామంలో 150 హెక్టార్ల విస్తీర్ణంలో గిరిజనులతో మల్బరీ సాగు చేయిం చామని, మల్బరీ సాగు సంవత్సరం నుంచి సంవత్సరన్నర కాలంలో దిగుబడి వస్తుందని, గిరిజనులు సమన్వయంతో ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకోవాలని, పంట సాగులో శిక్షణ ఇస్తామన్నారు.

పంట ఉత్పత్తి విక్రయించుకునేందుకు గిరిజన కార్పొరేషన్ ద్వారా కనీస మద్దతు ధర నిర్ణయించి, గిరిజనుల కోసం గోదాం, శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కోటపల్లి, వేమనపల్లిలలో మల్బరీ సాగులో ఉత్పత్తితో పాటు దారం తయారు చేసేందుకు గిరిజన రైతులకు శిక్షణ అందించేం దుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.