calender_icon.png 31 October, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మైరా ఈస్తటిక్ సెంటర్ ప్రారంభం

31-10-2025 12:07:26 AM

కొండాపూర్‌లోని బొటానికల్ గార్డెన్ రోడ్‌లో ఏర్పాటు

సందడి చేసిన టాలివుడ్ నటీమణులు హెబ్బాపటేల్, సత్యకృష్ణన్

హైదరాబాద్, అక్టోబర్ 30(విజయక్రాంతి): భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత ఈస్తటిక్ క్లినిక్, మైరా ఈస్తటిక్ సెంటర్ (మ్యాక్)ను కొండాపూర్ లోని బొటానికల్ గార్డెన్ రోడ్ లో గల అవలోన్ కోర్ట్‌లో ఆరంభమైంది. ఈ క్లినిక్‌ను మ్యాక్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు డాక్టర్ శ్రీవల్లి కొర్రపాటి, ప్రఖ్యాత టాలీవుడ్ నటీమణులు హెబ్బా పటేల్, సత్య కృష్ణన్ లతో కలిసి ప్రారంభించారు. సాంకేతికత, అందం..  లగ్జరీల మేళవింపుగా జరిగిన ప్రారంభ వేడుక కనువిందు చేసింది.

ఈ సందర్భంగా మ్యాక్ చైర్‌పర్సన్, వ్యవస్థాపకురాలు డాక్టర్ శ్రీవల్లి కొర్రపాటి మీడియాతో మాట్లాడుతూ, ఈ క్లినిక్ అధునాతనమైన స్కిన్, హెయిర్, లేజర్, హెయిర్ ట్రాన్స్ ప్లాంట్ వంటి చికిత్సలను, 100% శాశ్వత ఫలితాలను అంద జేస్తుందన్నారు.

ఈ ప్రత్యేకమైన క్లినిక్ ప్రపం చ స్థాయి నైపుణ్యం, అధునాతన సాంకేతికత, ప్రీమియం ఉత్పత్తులు  సౌందర్య సంరక్షణకు వ్యక్తిగతీకరించిన విధానం మిశ్రమం తో ఏఐఆధారిత, ఎఫ్డ్‌డీఎల ఆమోదిత విధానాలను అందిస్తుందని, ఆంధ్రప్రదేశ్ లో 10 వేల మందికి పైగా సంతృప్తి చెందిన క్లయింట్లు కలిగి మ్యాక్ తెలంగాణలో కూడా ఇదే ఉత్సాహంతో ఉత్తమ సేవలను అందించనున్నామన్నారు.