calender_icon.png 31 October, 2025 | 10:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్ విడుదల చేయాలి

31-10-2025 12:09:06 AM

రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలలు, యూనివర్శీటీల బంద్ జయప్రదం

హైదరాబాద్, కరీంనగర్ జిల్లాలో పోలీసులు అరెస్టులు, ఖండించిన రాష్ట్ర కమిటీ

 బంద్ అనంతరం నారాయణగూడ నుంచి వైఎంసీఎ వరకు భారీ ర్యాలీ

ముషీరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్రంలో మార్పు కావాలనే నినాదంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులు సంక్షేమం విస్మరించిందని, 23 నెలలుగా విద్యార్థులు, తల్లిదం డ్రులు, యాజమాన్యాలు పెండింగ్ ఫీజు బకాయిలు, స్కాలర్ షిప్స్ కోసం రోడ్డెక్కారు. అయినా ప్రభుత్వం సమస్య పరిష్కారం చేయకుండా ఇంకా జఠిలం చేస్తుందని తక్షణమే రాష్ట్రంలో ఉన్న పెండింగ్ స్కాలర్ షిప్స్, ఫీజు రీయంబర్స్ విడుదల చేయాలని ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన  విద్యాసంస్థల బంద్ జయప్రదం అయ్యింది.

ఈ సందర్భంగా హైదరాబాద్‌లో బంద్ సందర్భంగా నారయణగూడ నుండి వైఎంసిఎ సర్కిల్ వరకు భారీ ర్యాలీ నిర్వహిం చారు. హైదరాబాద్ నగరంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు లెనిన్ గువేరాను బస్సులు అడ్డుకుంటుండుగా  అక్రమంగా అరెస్ట్ చేశారు. ఉస్మాని యాలో బంద్ చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులను అరెస్ట్ చేశారు. కరీంనగర్, మహబూ బ్‌నగర్‌లో పోలీసులు నిర్బంధం ప్రయోగించారు.

ఈ అక్రమ నిర్బంధాన్ని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ భారీ ప్రదర్శనలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష,  కార్యదర్శులు ఎస్. రజనీకాంత్, టి. నాగరాజు, రాష్ట్ర ఉపాధ్యక్షులు డి.కిరణ్, కె.అశోక్ రెడ్డి, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు జె. రమేష్, హైదరాబాద్ జిల్లా నాయకులు స్టాలిన్, నాగేందర్, మనోజ్, ఆంజనేయులు, శివ గణేష్, కార్తీక్, శ్రీకాంత్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.