18-12-2025 07:27:24 PM
ఉప్పల్ (విజయక్రాంతి): వీజె కన్సల్టెన్సీ రీసెర్చ్ సంస్థ నిర్వహించిన నాణ్యత నిర్వహణ వ్యవస్థ సర్వేలో నాచారం పోలీస్ స్టేషన్ కు ఉత్తమ గుర్తింపు లభించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు గురువారం రోజున నాచారం పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ ధనుంజయ గౌడ్ ధ్రువీకరణ పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ ప్రజా భద్రత చట్టాలు అమలు శాంతి భద్రతల నిర్వహణ సేవలపై క్యూఆర్ ఓ ఆధ్వర్యంలో కొంతకాలంగా నగరంలో పోలీస్ స్టేషన్ సందర్శించి సర్వేలు నిర్వహించామని తెలిపారు.
ఈ సర్వేలో నాచారం పోలీస్ స్టేషన్ కు ఉత్తమ గుర్తింపు లభించిందని ప్రజల భద్రత కల్పించే విషయంలో నేర నియంత్రణ పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాలు పరిశుభ్రత పెట్టుకోవడం లాంటిపై ఓటింగ్ శాతం బాగా వచ్చిందని వాళ్ళు తెలిపారు. అనంతరం ఆ సంస్థ నిర్వాహకులు గాబ్రియల్ నాచారం ఎస్ హెచ్ ఓ ధనంజయ గౌడ్ కు ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో నాచారం పోలీస్ స్టేషన్ అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ వెంకటయ్య సెక్టార్ ఎస్సైలు ఎస్ మై బల్లి ప్రభాకర్ రెడ్డి నాచారం పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.