calender_icon.png 22 October, 2025 | 1:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓరుగల్లు గాన కళావైభవం ప్రజా చైతన్య యాత్ర

21-10-2025 10:06:18 PM

ప్రజాకవి మైస ఎర్రన్న

హనుమకొండ టౌన్ (విజయక్రాంతి): హనుమకొండ బాలసముద్రం ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రజా కవి మైస ఎర్రన్న మాట్లాడుతూ మన తెలుగు నేల సాంస్కృతిక గాథల్లో మరో విశిష్ట అధ్యాయం “ఓరుగల్లు గాన కళావైభవం” అనే ప్రజా చైతన్య యాత్ర పోస్టర్ ఆవిష్కరించారు. ఇది కేవలం ఒక సంగీత కార్యక్రమం కాదు మనిషి విలువలను, సమాజ మానవతను, సృజనాత్మకతను స్ఫూర్తింపజేసే ఒక ఉద్యమం, సంగీతం ద్వారా ప్రజల హృదయాలను కలిపే ప్రయత్నం. ఈ చారిత్రక వేడుకలకు ప్రజలందరూ, విద్యార్థులు, కళాభిమానులు, మహిళా సంఘాలు, యువత అందరూ హాజరై ఈ సంస్కృతిక స్రవంతిని భాగస్వామ్యలుగా చేయాలని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాం అని అన్నారు.

అక్టోబర్ 26న హనుమకొండలోని కాళోజీ కళాకేత్రం వేదికగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ మహోత్సవం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో  ప్రొ.వి తిరుపతయ్య, విశ్వ కవి సిరాజుద్దీన్, ఆంగ్ల కవి నల్ల లక్ష్మీనారాయణ, మైస ఏలియ, జూపాక శివ, మట్టెడ అనిల్ కుమార్, తండ సదానందం, సమన్వయ కర్త బిటవరం శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.