21-10-2025 10:09:02 PM
హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు..
హుజూర్ నగర్: శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు వెలకట్టలేనివి అని హుజూర్ నగర్ సీఐ చరమంద రాజు, శాంతి సంఘం అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జున్ రావు అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని మంగళవారం హుజూర్ నగర్ సర్కిల్ పోలీసుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని శాంతి స్తూపం వద్ద సర్కిల్ లోని పోలీస్ అధికారులు, శాంతి సంఘం ఆధ్వర్యంలో విధి నిర్వహణలో అమరులైన పోలీసులకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సిఐ చరమందరాజు మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా ఎంతోమంది పోలీసులు ప్రాణ త్యాగం చేశారన్నారు. విధుల్లో ప్రాణాలు వదిలిన వారిని స్మరించుకోవడం మనందరి బాధ్యత అన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరెడ్డి, ఎస్సైలు బండి మోహన్, బాబు, నరేష్, కోటేష్, రవీందర్, కోడి ఉపేందర్, జక్కుల మల్లయ్య, గల్లా వెంకటేశ్వర్లు, మేళ్లచెరువు ముక్కంటి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.