25-10-2025 04:59:43 PM
మరిపెడ, నరసింహుల పేట మండలాలలో వరుస దొంగతనాలు..
మరిపెడ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా మరిపెడ, నరసింహుల పేట మండలాలలోని రాంపురం, అజ్మీర తండా (బంజారాపు) వివిధ గ్రామాల్లో ట్రాన్స్ఫార్మర్ దొంగతనాల ఘటనలు పెరిగిపోతున్నాయి. శుక్రవారం రాత్రి మరిపెడ మరియు ఇతర గ్రామాల్లోని రెండు ట్రాన్స్ఫార్మర్ల నుండి రాగి తీగలు, ఆయిల్ దొంగలించబడ్డాయి. ఈ దొంగతనాల కారణంగా ఆయా గ్రామాల్లోని లక్షలాది మంది ప్రజలు రైతులు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా వ్యవసాయ క్షేత్రాలకు నీటిపారుదల నిలిచిపోయింది ఇప్పటికే దొంగల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ దొంగతనాలు పోలీసులకు పెద్ద సవాల్ గా మారాయి.