25-10-2025 04:40:36 PM
ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ..
మందమర్రి (విజయక్రాంతి): సింగరేణిలో గత ఆరు నెలలుగా నిలిచిన మెడికల్ బోర్డును వెంటనే నిర్వహించి అనారోగ్యంతో బాధపడుతున్న కార్మిక వారసులకు ఉద్యోగాలు కల్పించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ డిమాండ్ చేశారు. పట్టణంలోని యూనియన్ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సింగరేణి యాజమాన్యం, ప్రభుత్వం కలిసి 6 నెలలుగా మెడికల్ బోర్డు నిర్వహించకుండా మెడికల్ దందా, విజిలెన్స్ ల పేరిట బోర్డ్ నిర్వహించకుండా కాలయాపన చేస్తుందని ఆయన మండిపడ్డారు. ఇప్పటికే జరిగిన మెడికల్ బోర్డులో ఇన్వాలిడేషన్ అయి ఉద్యోగం చేయడానికి సిద్దంగా ఉన్న డిపెండెంట్ లకు పోస్టింగ్ లు ఇవ్వకుండా వారిని మానసికంగా ఆర్ధికంగా నష్టపరస్తున్నారని ఆయన ఆవేదవ వ్యక్తం చేశారు.
వెంటనే మెడికల్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఇదివరకు జరిగిన మెడికల్ బోర్డులో ఇన్వాలిడేషన్ అయిన వారి డిపెండెంట్లకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. అలాగే మైనింగ్ స్టాప్ ఉద్యోగులకు మెడికల్ అయిన వారికి ఒప్పందం ప్రకారం సూటబుల్ జాబ్ సర్కులర్ ను విడుదల చేయాలన్నారు. లేకుంటే ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని, అవసరమైతే సమ్మె చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశం లో వైస్ ప్రెసిడెంట్ భీమ నాథుని సుదర్శన్, బ్రాంచ్ అసిస్టెంట్ సెక్రటరీ సోమిశెట్టి రాజేశం, జాయింట్ సెక్రటరీ కంది శ్రీనివాస్, క్లబ్ సెక్రటరీ పి బాణయ్య, కేకే5 ఫిట్ సెక్రటరీ గాండ్ల సంపత్, ఇ రాజేశ్వర్ రావు, జెట్టి మల్లయ్య యాదవ్ లు పాల్గొన్నారు.