calender_icon.png 21 September, 2025 | 3:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నన్హీ పరీ లిటిల్ మిస్ ఇండియా

21-09-2025 12:27:00 AM

2025కు ఆడిషన్స్ విజయవంతం

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 20 (విజయక్రాంతి): కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (కిట్) ఫౌండర్, కిట్ డీమ్డ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ స్థాపకుడు, విద్యావేత్త, సామాజికవేత్త, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అచ్యుత సామంత ఆధ్వర్యంలో బాలికల సాధికారత, విద్య, ప్రతిభావికాసం కోసం 25 ఏళ్లుగా నిర్వహిస్తున్న ప్రతిష్టాత్మక వేదిక ‘నన్హీ పరీ లిటిల్ మిస్ ఇండియా’ ఈ ఏడాది దేశంలోని అన్ని రాష్ట్రాల్లో జరుగుతున్నాయి.

‘నన్హీ పరీ’ పోటీ ప్రధాన ఉద్దేశం.. 13 ఏళ్ల బాలికల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయడం మాత్రమే కాదు, వారి ఆత్మవిశ్వా సాన్ని పెంపొందించడం, స్వీయ విశ్వాసం, ప్రతిభను ప్రేరేపించడం. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో  ధైర్యంగా ఎదుర్కోవ డంలో నైపుణ్యం కల్పించడం. ప్రతిష్టాత్మక ఫినాలే ప్రతి సంవత్సరం డిసెంబర్‌లో భువనేశ్వర్‌లో కిట్లో నిర్వహించబడుతుంది. దాని కి ముందుగా దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో ఆడిషన్స్ నిర్వహిస్తారు. ఈ ఏడాది ఈ పోటీ 25వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది.

తెలంగాణ రాష్ట్ర ఆడిషన్స్ శనివారం హైదరాబాద్లోని తెలుగు విశ్వవిద్యాలయంలో నిర్వహించబడ్డాయి. ఆంధ్ర, తెలం గాణలోని పలు పాఠశాలల నుండి విద్యార్థినులు హాజరయ్యారు. 36 మంది అభ్యర్థులు ఆడిషన్స్ లో పాల్గొన్నారు. అందులో నుంచి ఇద్దరు ప్రతిభావంతులైన యువతులు ఫైనల్‌కు ఎంపిక చేయబడతారు. తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్‌పర్సన్ డాక్టర్ గుమ్మడి వి వెన్నెల ప్రత్యేక అతిథిగా పాల్గొని, పోటీలో పాల్గొన్న బాలికలను అభినందించారు.