21-09-2025 12:25:31 AM
జిల్లా మంత్రిని కోరిన కాటా శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు
గుమ్మడిదల: గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని బొంతపల్లి గ్రామంలో ఉన్న శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి పనులపై పటాన్‌చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జి కాటా శ్రీనివాస్ గౌడ్, మంత్రి దామోదర్ రాజనర్సింహని కలిశారు. దేవాలయ అభివృద్ధి పనులకు కావలసిన సదుపాయాలపై చర్చించి, తక్షణ చర్యలు తీసుకోవాలని మంత్రివర్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, గుమ్మడిదల మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నర్సింగ్ రావు, జిన్నారం మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వడ్డె కృష్ణ, మాజీ ఎంపీటీసీ గోవర్ధన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.