calender_icon.png 13 May, 2025 | 9:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వంలో గొప్ప సృష్టి తల్లి

12-05-2025 01:39:46 AM

మదర్స్‌డే సందర్భంగా కేటీఆర్ ట్వీట్

హైదరాబాద్, మే 11 (విజయక్రాంతి): సృష్టికి మూలమైన తల్లులందరికీ వందనం అంటూ మదర్స్‌డే సందర్బంగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదివారం హ్యాష్‌ట్యాగ్ హ్యాపీమదర్స్‌డే పేరుతో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తల్లులందరికీ వందనాలు తెలుపుతున్నట్టు చెప్పారు.

ఈ మదర్స్ డే సందర్భంగా, మన మాతృభూమిని కాపాడే ధైర్యయోధులను త్యాగం, ప్రేమతో తీర్చిదిద్దిన ప్రత్యేక ధైర్యవంతులైన తల్లులకు నమస్కరిస్తున్నట్టు పేర్కొన్నారు. దేశం కోసం తన లోకాన్నే ధారపోసే తల్లులందరికీ పాధాభివందనమన్నారు.