calender_icon.png 18 July, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

"నషా ముక్త్ భారత్ అభియాన్" కార్యక్రమాలను విజయవంతం చేయాలి

20-06-2025 06:40:50 PM

అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే..

కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): జిల్లాలో ఈనెల 26 వరకు నిర్వహించనున్న నషా ముక్త్ భారత్ అభియాన్(Nasha Mukt Bharat Abhiyaan) కార్యక్రమాలను విజయవంతం చేయాలని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే(Additional Collector Ashwini Tanaji Wakade) అన్నారు. శుక్రవారం నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి సంబంధించిన సమన్వయ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్ మాట్లాడుతూ... అధికారులు సమన్వయంతో పని చేస్తూ కరీంనగర్ జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని అన్నారు. డ్రగ్స్ మూలాలను పెకిలించి వేయాలని పేర్కొన్నారు.

మాదకద్రవ్యాల నిర్మూలనకు ఈనెల 26 వరకు జిల్లాలో నిర్వహించనున్న ర్యాలీలు, అవగాహన సదస్సులు, ప్రచార కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. అనంతరం డ్రగ్స్ నిర్మూలన ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కేశవరెడ్డి, సీఐ పుల్లయ్య, ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, డివైఎస్ఓ శ్రీనివాస్ గౌడ్ , సిడిపిఓ శ్రీమతి, క్వాలిటీ కోఆర్డినేటర్ అశోక్ రెడ్డి డిసిపిఓ పర్వీన్, తదితరులు పాల్గొన్నారు.