18-10-2025 08:52:18 PM
ఘట్ కేసర్ (విజయక్రాంతి): పోచారం మున్సిపల్ వెంకటాపూర్ లోని అనురాగ్ యునివర్సిటీ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలోని ఐ. ఈ. ఈ. ఈ ఆర్. ఏ. ఎస్ అండ్ ఎన్. టీ స్టూడెంట్ చాప్టర్, క్యాడ్ క్లబ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న 30 గంటల నేషనల్ లెవెల్ హ్యాకథాన్ "మెకోవేట్" శనివారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎఎఫ్ఎం-ఎన్ఐ- ఎంఎస్ఎంఈ హైదరాబాద్ డాక్టర్ సత్యేంద్ర కుమార్ విచ్చేసి ఇంజనీర్లకు బిజినెస్ థింకింగ్ యొక్క ప్రాముఖ్యతపై వివరించారు. ఇందులో వివిధ రాష్ట్రాలకు చెందిన 60 ఔత్సాహిక విద్యార్థి గ్రూపులు (180 మంది) మూడు డొమైన్లలో (రిఫార్మ్ త్రీడీ, లింక్ అండ్ లోడ్, ప్రాజెక్టు బ్లూ) వివిధ ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈ డొమైన్లకు నరేష్ పిరంగి సి.ఈ.ఒ టెక్4జిఈ, విష్ణు తేజ అన్నంరాజు ప్రొడక్ట్ మేనేజర్ ఫీనమ్ టెక్నాలజీస్, డాక్టర్ నంద్యాల మురళీ కృష్ణ ఫౌండర్ దత్త సోలుషన్స్ వాగన్ వే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు. హ్యాకథాన్ అన్ని మాడుల్స్ విజేతలకు బహుమతులు అందించారు. ఈ కార్యక్రమ ముగింపుకి డాక్టర్ యం.డి. సికిందర్ బాబా కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్, డాక్టర్ కె. శ్రీనివాస చలపతి మెకానికల్ విభాగ అధిపతి, అసోసియేట్ డీన్ స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, డాక్టర్ యన్. మదన్ మోహన్ రెడ్డి డిప్యూటీ డైరెక్టర్ ఇన్నోవేషన్స్, హ్యాకథాన్ కో కన్వీనర్ డాక్టర్ పి. సరిత, హ్యాకథాన్ ఫ్యాకల్టీ కో-ఆర్డినటర్లు డాక్టర్ జష్ కుమార్, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ స్రవంతి, యం. రాజ్ కుమార్ రెడ్డి, కె. శ్రవణ్ కుమార్, ఇతర అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.