calender_icon.png 19 October, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

డీపీఆర్వో నియామకం పట్ల టియుడబ్ల్యూజే హర్షం

18-10-2025 08:52:41 PM

జగిత్యాల అర్బన్,(విజయక్రాంతి): గత కొంతకాలంగా జిల్లాలో పౌర సంబంధాల అధికారి పోస్టు ఖాళీగా ఉండగా శనివారం జెడ్పి డిప్యూటీ సీఈవో పల్లికొండ నరేష్ ను నూతన డిపిఆర్ఓ గా పూర్తి అదనపు బాధ్యతలతో నియమిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేయడం పట్ల టియుడబ్ల్యూజే ఐజేయు జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి లు హర్షం వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... 5 రోజుల క్రితం రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ను ఐజేయు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, సంపూర్ణ చారి, ఉపాధ్యక్షుడు గడ్డల హరికృష్ణ, సీనియర్ రిపోర్టర్ మదన్మోహన్, రాజు తదితరుల తో ధర్మపురి క్యాంపు కార్యాలయంలో కలిసి డిపిఆర్ఓ ను నియమించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారు.

జిల్లాలో పౌర సంబంధాల అధికారి పోస్టు ఖాళీగా ఉండడంతో ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు పత్రికల ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో అందడం లేదని, అదేవిధంగా అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనే మంత్రులు, ఇతర అధికారుల సమాచారం కూడా  పాత్రికేయులకు సరైన సమయంలో చేరడం లేదని మంత్రి లక్ష్మణ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్ళడం జరిగిందన్నారు. స్పందించిన మంత్రి అప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ తో ఫోన్లో మాట్లాడి వారం రోజుల్లో కొత్త డీపీఆర్ఓ నియామకాన్ని చేపడుతామని ఇచ్చిన హామీ మేరకు ఈ నియామకం చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.