calender_icon.png 20 December, 2025 | 9:40 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ప్రారంభమైన మైనార్టీ బాలికల కళాశాలల క్రీడలు

20-12-2025 07:42:43 PM

ముకరంపుర,(విజయక్రాంతి): ఉమ్మడి జిల్లాస్థాయి మైనార్టీ బాలికల కళాశాలల క్రీడా పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో ఈ పోటీలను డీఐవో సుభాన్, ఆర్సీఎల్సి విమలలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... క్రీడలతో మానసిక ఉల్లాసం, శారీరక అభివృద్ధి కలుగుతుందన్నారు. వివిధ ప్రాంతాల విద్యార్థుల మధ్య స్నేహసంబంధాలు పెంపొందుతాయన్నారు.

బాలికలు క్రీడల్లో రాణించి భవిష్యత్తులో ఉత్తమ క్రీడాకారిణులుగా ఎదగాలన్నారు. శుక్రవారం బాలుర క్రీడా పోటీలను నిర్వహించగా, శనివారం బాలికలకు పోటీలను నిర్వహించారు. వివిధ మైనార్టీ పాఠశాలలు, కళాశాలల నుంచి దాదాపు 600 వ ౦ది క్రీడాకారిణులు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమంలో విజిలెన్స్ ఆఫీసర్ ఇంతియాజ్, అకాడమి కో-ఆర్డినేటర్ మెహరాజ్, తెలంగాణ కబడ్డీ సంఘ ఉపాధ్యక్షులు సీహెచ్ సం పర్రావు, డీవైఎస్ శ్రీనివాస్ గౌడ్, కబడ్డీ సంఘ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లేష్ పాఠశాల ప్రిన్సిపాల్ ఎన్ సరిత, తదితరులు పాల్గొన్నారు.