calender_icon.png 17 January, 2026 | 8:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వెంకటాపురం, వాజేడు మండలాల జోలికొస్తే ఊరుకోం!

17-01-2026 12:42:55 AM

  1. జిల్లా మార్పు ప్రతిపాదనను తీవ్రంగా ఖండిస్తున్నాం
  2. తిరిగి ఖమ్మంలో కలపడం అంటే ఈ ప్రాంతాన్ని నాశనం చేయడమే
  3. జేఏసి ములుగు(భూపాలపల్లి) జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్

వెంకటాపురం(నూగూరు),జనవరి16(విజయక్రాంతి): ఉమ్మడి ఖమ్మం జిల్లాలో దశాబ్దాల పాటు వెనుకబడి ఉన్న వెంకటాపురం,వాజేడు మండలాలను మళ్లీ అదే జిల్లాలో కలి పేందుకు జరుగుతున్న కుట్రలను వాజేడు,వెంకటాపురం మండలాలు జేఏసి ములుగు(భూపాలపల్లి) జిల్లా సాధన సమితి కన్వీనర్ డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ శుక్రవారం ఒక ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఇటీవల శాసనసభలో జిల్లాల పునర్విభజనపై వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ, ఈ ప్రతిపాదనను తాము ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

అభివృద్ధి ఆగిపోవాలా?

ఈ సందర్భంగా డాక్టర్ నగేష్ మాట్లాడుతూ.. ‘గతంలో ఉ మ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నప్పుడు ఈ రెండు మండలాలు అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్నాయని. కేవలం భౌగోళిక దూరం వల్లే పాలన అందక ఈ ప్రాంత వాసులు దశాబ్దాల పాటు వివక్షకు గురయ్యారని వివరించారు. ఇప్పుడు భూపాలపల్లి (ప్రస్తుతం ములుగు) జిల్లాలో భాగంగా ఉండి అభి వృద్ధి చెందుతున్న ఈ ప్రాంతాలను మళ్లీ వెనక్కి నెట్టాలని చూడటం దుర్మార్గం‘ అని మండిపడ్డారు.

రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల బతుకులతో ఆడుకోవద్దు...

జిల్లా పునర్విభజన పేరుతో రాజకీయ ప్రయోజనాల కోసం లేదా కొందరు నేతల స్వార్థం కోసం ప్రజలను ఇబ్బందులకు గురి చేయవద్దని ఆయన హెచ్చరించారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో ముంపు మండలాల సమస్య వేరని, దాని ని సాకుగా చూపి మారుమూల ఉన్న వెంకటాపురం, వాజేడు మండలాలను బలవంతంగా కలపాలని చూస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఘాటుగా స్పష్టం చేశారు.

ఆందోళన తప్పదు..

ప్రభుత్వం ప్రజల అభిప్రాయాలను విస్మరించి ముందుకు వెళ్తే, ఈ ప్రాంత ప్రజలను ఏకం చేసి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నగేష్ హెచ్చరించారు. ఈ మండలాల ప్రజలు భూ పాలపల్లి/ములుగు జిల్లాల పరిధిలోనే సౌకర్యంగా ఉన్నారని, పాలనను చేరువ చేసిన ప్రస్తుత వ్యవస్థనే కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు.