calender_icon.png 7 May, 2025 | 10:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యం విక్రయించాలి

03-05-2025 12:21:58 AM

ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే మల్లారెడ్డి 

మేడ్చల్, మే 2(విజయ క్రాంతి): రైతులు ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలని మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ అన్నారు. శుక్రవారం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని పలు గ్రామాలలో మాజీమంత్రి, స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళారులను నమ్మి రైతులు మోసపోవద్దన్నారు. రైతులకు మద్దతు ధర అందించడానికి ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలని, తూకం వేయడంలో జాప్యం చేయవద్దని అధికారులకు సూచించారు.

మాజీ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల వల్ల రైతులకు దళారుల బెడద తప్పిందన్నారు. ప్రతి గింజను కొనుగోలు కేంద్రాలలోనే విక్రయించాలన్నారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మార్కెట్ కమిటీ చైర్మన్ నరసింహులు యాదవ్, డీసీఎంఎస్ వైస్ చైర్మన్, షామీర్పేట్ ఎఫ్‌ఎసిఎస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, బిజెపి జిల్లా అధ్యక్షుడు బుద్ధ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.