calender_icon.png 6 November, 2025 | 3:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పలిమెలలో ప్రకృతి విలయం

06-11-2025 01:14:46 AM

-భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లోని  మహదేవపూర్ దండకారణ్యంలో క్లౌడ్ బరస్ట్?

-వందల ఎకరాల్లో పంటలు నష్టం 

-నేలకూలిన చెట్లు

-గతంలోనూ మేడారం అడవుల్లో క్లౌడ్ బరస్ట్

కాటారం, నవంబర్ 5 (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా సరిహద్దుల్లోని దట్టమైన మహాదేవపూర్ దండకారణ్యంలో ప్రకృతి ప్రళయాన్ని సృష్టించినట్టుగా తెలుస్తున్నది. తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో గోదావరి నది పరివాహక ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ జరిగిన్నట్టు సమాచారం. పలిమల మండలంలోని పలు ప్రాంతాల్లో మంగళ, బుధవారాల్లో ప్రకృతి ప్రళయం వల్ల భారీ చెట్లు నేలకొరిగాయి.

సుడిగాలిలా ఏర్పడిన నీటి కుండల మాదిరి మేఘాల క్లౌడ్ బరస్ట్ వల్ల సుమారు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల మేర పంట పొలాలు దెబ్బతిన్నాయి. పత్తి, మిర్చి, వరి పంటలు వందల ఎకరాల్లో నష్టపోయినట్లు రైతాంగం పేర్కొంటుంది. పెద్ద పెద్ద చెట్లు భూమి నుంచి పెకిలించుకుని విరిగిపడినట్లు తెలుస్తోంది. గతేడాది మేడారం అడవుల్లో సైతం ఇదే తరహా క్లౌడబరస్ట్ జరిగిన విషయం తెలిసిందే. దండకారణ్యంగా పేరు ఉన్న మహాదేవపూర్ అడవుల్లో ఏటా ఏదో ఒక సంఘటన జరిగి సంచలనంగా మారుతుంది.

ఈ నేపథ్యంలో పలిమెలలో ఏర్పడిన క్లౌడ్ బరస్ట్ ప్రత్యేకతను సంతరించుకుంది. పలిమేల మండలంలోని లంకలగడ్డ ప్రాంతంలో మేఘాలు భూమికి ఆనుకున్నట్లుగా, చేతులు పైకి ఎత్తితే తాకుతున్నట్లుగా కదలికలు జరిగినట్టు స్థానికులు చెపుతున్నారు. మేఘాలు చల్లటి వాతావరణంతో పాటు కమ్ముకున్న మబ్బులు పలిమల మండల వాసులను ఆందోళనకు గురిచేశాయి. గత మంగళ, బుధవారాల్లో జరిగిన ఈ సంఘటనను ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. ఊరికి ఉత్తరాన దక్షిణం వైపుగా నీటి బుడగలాగా ఊరి మీద నుంచి కదులుతుండటం ప్రకృతి వైపరీత్యంగానో, దేవుడి మహిమగాను, మరికొందరు కీడును తలపింపచేసేదని చర్చించుకుంటున్నారు.

వ్యవసాయ పనులు జరుగుతున్న నేపథ్యంలో రైతులు, వ్యవసాయ కూలీలు, ప్రజలు పొలాలు చేనుల నుంచి ఇళ్లలోకి వచ్చే క్రమంలో మేఘాలు భూమిని తాకుతున్నట్టుగా ఉన్న కదలికలు పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్నారు. సరైన సమాచారం లేకపోవడం ఒకవైపు కాగా మారూముల అటవీ ప్రాంతంగా, నక్సలైట్ ప్రభావిత ప్రాంతంగా పేరున్న పలిమెల ప్రజలకు ప్రస్తుత పరిస్థితిని, సమాచారాన్ని అందించేవారు లేకపోవడంతో వారిలో సందిగ్ధత నెలకొంది. ఎప్పుడు ఏమి జరుగుతుందో తెలియని అనిశ్చిత వాతావరణం ఏర్పడింది. 

చేతికందే ఎత్తులో నీటి కుండలు?

కొంతమంది వ్యవసాయ పనులను ముగించుకొని ఎడ్ల బండిలో ఇండ్లలోకి వస్తున్న క్రమంలో నీటి కుండలుగా అలాగే సుడిగాలి మాదిరిగా వచ్చిన ప్రళయంతో కొంతమంది భూమి నుంచి రెండు మూడు ఫీట్ల ఎత్తు వరకు ఆకాశంలో తేలి ఆడుతున్నట్లుగా పరిస్థితులు ఎదురయ్యాయని పేర్కొంటున్నారు. అలాగే గురుత్వాకర్షణ శక్తితో కొద్ది క్షణాల్లోనే భూమి మీద యధాతధ స్థితిలో నిలబడినట్లుగా ప్రజలు చెపుతున్నారు. ఇదిలా ఉండగా పలిమల మండలంలోని పలు ప్రాంతాల్లో ప్రకృతి ప్రళయం వల్ల భారీ చెట్లు నేలకొరిగాయి.

సుడిగాలిలా ఏర్పడిన నీటి కుండల మాదిరి మేఘాల క్లౌడ్ బరస్ట్ వల్ల సుమారు మూడు నుంచి ఐదు కిలోమీటర్ల మేర పంట పొలాలు దెబ్బతిన్నాయి. పత్తి, మిర్చి, వరి పంటలు వందల ఎకరాల్లో నష్టపోయినట్లు రైతాంగం పేర్కొంటుంది. పెద్ద పెద్ద చెట్లు భూమి నుంచి పెకిలించుకుని విరిగిపడినట్లు తెలుస్తోంది . ఒకే ప్రాంతంలో చెట్లన్నీ కూలిపోవడం పట్ల గిరిజన ప్రాంత ప్రజలు కీడు జరుగుతుందేమోనని భయాందోళనతో బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.

ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి ఈ ప్రళయం పట్ల పూర్తిస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని పలువురు చర్చించుకుంటున్నారు. గతంలో మేడారం అడవి ప్రాంతంలో జరిగిన క్లౌడ్ బరస్టు మాదిరిగానే.. పలిమల మండలం లంకలగడ్డ ప్రాంతంలో ప్రకృతి బీభత్వాన్ని సృష్టించినట్లు అర్థమవుతుననది.

మేడారం అడవులకు పక్కనే లంకలగడ్డ అడవి ప్రాంతం ఉండటం కూడా చర్చనీయాంశం కాగా అసలు ఈ ప్రాంతంలో ఏం జరుగుతోందని పలువురు పలు రకాలుగా చర్చించుకుంటున్నారు. జిల్లా అధికార యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాంత ప్రజలకు ప్రకృతి ప్రళయం పట్ల పూర్తిస్థాయిలో అవగాహన కల్పించి, వారిలో ఉన్న భయాన్ని తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మేధావులు పేర్కొంటున్నారు.

నేడు ఉరుములు, మెరుపులతో వర్షాలు హైదరాబాద్ సహా పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): రానున్న రెండు మూడు రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం ఉరుములు, మెరుపులు, గంటకు 30 కి.మీ.వేగంతో వీచే ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని పేర్కొంది.

రాష్ట్రంలోని హైదరాబాద్, ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, నల్లగొండ, సూర్యాపేట, జోగులాంబ గద్వాల్, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబ్‌నగర్, నారాయణపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపింది.