calender_icon.png 8 October, 2025 | 6:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవీన్‌యాదవ్‌కే జూబ్లీహిల్స్ టికెట్!

08-10-2025 01:27:18 AM

  1. పోటీ నుంచి తప్పుకుంటున్నా 

మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ 

మూడు పేర్లతో జాబితాను ఢిల్లీకి పంపిన పీసీసీ 

ఇన్‌చార్జ్ మీనాక్షి, అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి జూమ్ మీటింగ్

బీసీలకే టికెట్ ఇవ్వాలని నిర్ణయం?

హైదరాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయినట్లుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌లో బీసీ అభ్యర్థినే బరిలోకి దింపాలని కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో అభ్యర్థి విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో జూమ్ సమావేశం నిర్వహించారు.

నియోజకవర్గంలో టికెట్ ఆశిస్తున్న ఆశావాహులు నుం చి నవీన్‌యాదవ్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, సీఎన్‌రెడ్డిల పేర్లతో కూడిన జాబితాను అధిష్టానానికి పంపించాలని సమావేశంలో నిర్ణయించి, జాబితాను ఢిల్లీకి పపించారు.

నియోజకవర్గంలో పట్టు ఉండి, స్థానిక అభ్యర్థితో పాటు విజయం సాధించే వ్యక్తినే అభ్యర్థిగా ప్రకటించాలని నిర్ణయించారు. టికెట్ కోసం మొదటి నుంచి ప్రయ త్నం చేసిన మాజీ మేయర్  బొంతు రామ్మోహన్ పోటీ నుంచి తప్పుకుంటున్న ప్రకటిం చడంతో ఇక నవీన్‌యాదవ్‌కు లైన్ క్లియర్ అయినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  

టికెట్ కావాలని అడగలేదు: బొంతు రామ్మోహన్ 

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక టికెట్ కావాలని తాను ఎవరిని అడగలేదని, అసలు  తాను పోటీలోనే లేనని నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ తెలిపారు. పార్టీ అభ్యర్థిని అధిష్టానం నిర్ణయిస్తుందని, టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా కాంగ్రెస్ గెలుపు కోసం పని చేస్తానని ప్రకటించారు. 

పీసీసీ అధ్యక్షుడితో  సీపీఐ నేతల భేటీ

పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సీపీఐ నేతలు భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక,  స్థానిక సంస్థ ల ఎన్నికల్లో పొత్తుల అంశంపై చర్చించారు. సీపీఐకి బలమున్న చోట పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని, అం దుకు కాంగ్రెస్ సహకరించాలని కోరా రు.

పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని మహేశ్‌కుమార్ హామీ ఇచ్చారు. ఈ భేటీలో సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, మాజీ ఎమ్మెల్యే పల్లా వెంక ట్‌రెడ్డి, నాయకులు తక్కలపల్లి శ్రీనివాస్‌రావు, నరసింహ, శంకర్ తదిరులున్నారు.