14-05-2025 12:08:20 AM
బీరకాయల వివేక్
సిద్దిపేట, మే 13 (విజయక్రాంతి):ప్రజాస్వామ్యంలో హింసకు తావుండకూడదనే ఉద్దేశంతో భారత రాజ్యాంగాన్ని అనుసరిస్తూ నిర్వహిస్తున్న ‘ఆపరేషన్ కగార్‘ను ఆపాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోరడం శోచనీయామని ఏబీవీపీ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ బీరకాయల వివేక్ విమర్శించారు.
మంగళవారం సిద్దిపేట ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అడవులలో నక్సల్స్ అంతరించి పట్టణాలలో పె రుగుతున్నారని చెప్పారు. అభివృద్ధికి ఆటంకాలు కలిగించే నక్సల్, మావోయిస్టులపై ఎందుకు ఉక్కు పిడికిలి బిగించరాదో చెప్పాలని ప్రశ్నించారు. నక్సలైట్ల చరిత్రను తెలియజేస్తూ ముఖ్యంగా వారి రక్త దాహాన్ని తీర్చుకోవడం కోసం సామాన్య ప్రజలను వర్గ శత్రువులుగా భావిస్తూ వారి రక్తాన్ని కళ్ళజూడడమే వారి ఉద్దేశం అంటూ వర్గ శత్రువు యొక్క రక్తాన్ని కళ్ళ చూడని వాడు నక్సలైటే కాదనేది వారి నమ్మకం అని ఎండగట్టారు.
పెట్టుబడిదారీ వ్యవస్థకు పెట్టుబడిదారుల కు వ్యతిరేకమంటూనే సామాన్య కూలీలు ప్రయాణించే కాకతీయ ఎక్స్ప్రెస్ లోని రెండు భోగిలను తగలబెట్టడం, వారి సిద్ధాంతం నచ్చక వారితో దూరంగా ఉన్నవారిని ఇన్ ఫార్మర్ల నేపంతో, ఎంతోమంది పోలీసు అధికారులను పొట్టన పెట్టుకోవడం, ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి నాయకులను హత్యాగావించటం మావోయిస్టు, నక్సల్స్ మరణకాండకు ప్ర తిరూపంగా మారిందన్నారు.
ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినప్పటికీ నోరు మెదపని కొం దరు కుహనా మేధావులు సెల్ఫ్ మేడ్ ఇంటలెక్చువల్ చలామణి అవుతున్న అర్బన్ నక్సలైట్లు, పౌర సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు అంటూ నేడు కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ కగార్‘ ను ఆపాలంటూ శాంతి చర్చలు జరపాలంటూ బహిరంగ సమావేశాల్లో మాట్లాడడం అంటే రా జ్యంగాని కించపరచడమేనని ఆరోపించారు. నక్సల్స్ గా పనిచేసి జనజీవన స్రవంతిలో కలిసి నే డు ప్రజాసేవకులుగా ఎందరో ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులుగా పని చేస్తున్నారని చెప్పారు.
ఇంటలెక్టువల్స్ ముసుగులో ప్రభుత్వ జీతాలు, పెన్షన్లు తీసుకుంటూనే ప్రభుత్వంపైన తిరుగుబాటు చేసే నక్సల్స్ కు వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. నక్సలిజం అడవుల్లో అంతరించి, విద్యాబుద్ధులు నేర్పాల్సిన విద్యాకమిషన్ ఉన్నతాధికారులు కూడా నక్సలైట్లకు మద్దతుగా మాట్లా డటం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం శోచనీయమైన అంశం అన్నారు. ఈలాంటి నరహంతక నక్సలైట్లను ఏరి పారెయ్యడాన్ని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ స్వాగతిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఫణీంద్ర, అంబేద్కర్ జోనల్ ఇంచార్జి అనీష్, సాయిరాం, ధనుష్, లోకేష్ తదితరులు పాల్గొన్నారు.