14-05-2025 12:10:13 AM
కౌడిపల్లి(మెదక్), మే 13:చెట్టును బైక్ ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి మృతి చెందిన సంఘటన కౌడిపల్లి మండలం మహ్మద్నగర్ శివారులో మంగళవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకా రం..మండలంలోని రాయిలాపూర్ గ్రామానికి చెందిన కుర్మ కిష్టయ్య(42) వెల్దుర్తి మండలం ద ర్పల్లి గ్రామంలో జాతరకు తన భార్య పద్మతో కలిసి సోమవారం తన బైక్ పై వెళ్ళాడు.
తిరిగి మంగళవారం బైక్ పై కిష్టయ్య ఒక్కడే వస్తున్నక్రమంలో మహమ్మద్ నగర్ శివారు హనుమాన్ మందిరం సమీపాన చెట్టుకు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్‌ఐ రంజిత్ రెడ్డి సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని నర్సాపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుని అల్లుడు గొర్రెకంటి షాదుల్లా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసు కొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
రాంగ్ రూట్లో కారు ఢీకొని ఇద్దరికి గాయాలు...
అతివేగంగా రాంగ్ రూట్ లో వచ్చిన కారు బైక్ ను ఢీకొట్టడంతో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన మండల పరిధిలోని వెంకట్రావుపేట్ గేటు సమీపాన నేషనల్ హైవే 765 డి పై మంగళవారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని రాజపేట గ్రామానికి చెందిన ఊరట్ల లక్ష్మణ్, తోళ్ల రమేష్ ఇద్దరు ద్విచక్ర వాహనంపై వెంకట్రావుపేట్ నుండి నర్సాపూర్ వైపు వెళుతుండగా నర్సాపూర్ నుండి మెదక్ వైపు వస్తున్న కారు అతివేగంగా రాంగ్ రూట్ లో వచ్చి బైకును ఢీకొట్టడంతో బైక్ పై ప్రయాణిస్తున్న రమేష్, లక్ష్మణ్ కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే 108 సహాయంతో ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర రంజిత్ రెడ్డితెలిపారు.