calender_icon.png 28 November, 2025 | 4:15 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదహారు రోజుల పండుగ- షురూ

27-11-2025 12:00:00 AM

‘వినాయకుడు’, ‘విలేజ్‌లో వినాయకుడు’, ‘కేరింత’ వంటి చిత్రాలను అందించిన డైరెక్టర్ సాయికిరణ్ అడివి మరో కొత్త సినిమాతో వస్తున్నారు. ‘పదహారు రోజుల పండుగ’ అనే పేరు తో వస్తున్న ఈ సినిమాతో సాయికృష్ణ దమ్మాలపాటి హీరో గా పరిచయవుతున్నారు. ఇందులో గోపిక ఉదయన్ హీరోయిన్. రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రదా పిక్చర్స్, సాయి సినీచిత్ర బ్యానర్‌పై సురేశ్‌కుమార్ దేవత, హరిత దుద్దుకూరు, ప్రతిభ అడివి నిర్మిస్తున్నారు.

బుధవారం నిర్వహించిన ఈ సినిమా పూజాకార్యక్రమానికి దర్శకులు కోన వెంకట్, కేకే రాధామోహన్, శేఖర్ కమ్ముల, నిర్మాతలు అల్లు అరవింద్, డీ సురేశ్‌బాబు, వై రవికుమార్ తదితరులు హాజరయ్యారు. హీరోహీరోయిన్ సాయికృష్ణ, గోపిక ఉదయన్, నటీమణులు రేణు దేశాయ్, అనసూయ భరద్వాజ్, నిర్మాత సురేశ్ కుమార్, చిత్రబృందం పాల్గొన్నారు. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందిస్తుండగా పీ కళ్యాణి సునీల్ డీవోపీగా, సూర్యతేజ లంక ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. డైరెక్టర్ సాయికిరణ్ అడివితో కలిసి మల్లి అంకం, సోమశేఖర్ పొక్కళ్ల, శ్రీరామ్ మన్నార్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు.