26-04-2024 12:17:32 AM
n న్యూట్రాసిటికల్ బ్రాండ్స్ జేవీ ఏర్పాటు
ముంబై, ఏప్రిల్ 25: వినూత్నమైన న్యూట్రాసిటికల్ బ్రాండ్ల తయారీ, మార్కెటింగ్‌కు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ లాబొరెటరీస్, ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం నెస్లేలు చేతులు కలిపాయి. విటమిన్లు, మినరల్స్, హెర్బల్స్ తదితర పోషకారోగ్య ఉత్పత్తులను భారత్‌తో సహా మరికొన్ని దేశాల్లో అందించేందుకు ఒక జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేయాలని ఇరు కంపెనీలు నిర్ణయించాయి. ఈ మేరకు ఒక ఒప్పందంపై సంతకాలు చేసినట్టు గురువారం ప్రకటించాయి. ఈ జేవీకి నెస్లే హెల్త్ సైన్స్ (ఎన్‌హెచ్‌ఎస్‌సీ)కి చెందిన పోషక ఆరోగ్య ఉత్పత్తుల తయారీ లైసెన్స్‌ను జేవీ కంపెనీకి అందిస్తుంది. అలాగే డాక్టర్ రెడ్డీస్ కొన్ని బ్రాండ్లను జేవీకి ఆఫర్ చేయడంతోపాటు వాణిజ్య సామర్థ్యాల్ని జేవీలో ఉపయోగిస్తుంది. జేవీలో మెజారిటీ 51 శాతం వాటా డాక్టర్ రెడ్డీస్ చేతిలో, మిగిలిన 49 శాతం వాటా నెస్లే వద్ద ఉంటుంది. ఆరేండ్ల తర్వాత వాటాను 60 శాతానికి పెంచుకునే కాల్ ఆప్షన్‌ను నెస్లే ఇండియా కలిగి ఉంటుంది. ఆ కాల్ ఆప్షన్‌ను నెస్లే ఉపయోగించుకుంటే డాక్టర్ రెడ్డీస్ వద్ద కనీసం 40 శాతం వాటా ఉంటుంది.
జేవీలో ఇరు కంపెనీల బ్రాండ్లు ఇవే..
నెస్లే గ్రూప్ తన నేచుర్స్ బౌంటీ, వోస్టియో బైఫ్లెక్స్, ఈస్టర్‌సీ, రిసోర్స్ హైప్రొటీన్, ఆప్టిఫాస్ట్, రిసోర్స్ డయాబెటిక్, పెప్టామెన్, రిసోర్స్ రెనల్, రిసోర్స్ డయాలసిస్‌ల ఉత్పత్తికి జేవీకి లైసెన్స్ ఇస్తుంది. డాక్టర్ రెడ్డీస్ న్యూట్రిషన్, ఓటీసీ విభాగాల్లోని తన రెబలాంజ్, సెలెవిడా, యాంటాక్సిడ్, కిడ్రిక్ డీ3, బెకోజింక్ బ్రాండ్ల లైసెన్స్‌ను జేవీకి ఆఫర్ చేస్తుంది.
రూ.5,000 కోట్లు దాటిన నెస్లే అమ్మకాలు
నెస్లే ఇండియా అమ్మకాల ఆదాయం ఒకే త్రైమాసికంలో తొలిసారిగా రూ.5,000 కోట్లను మించాయి. 2024 మార్చితో ముగిసిన త్రైమాసికంలో నెస్లే ఆదాయం 9 శాతం పెరిగి రూ. 5,268 కోట్లకు చేరగా, నికరలాభం 27 శాతం వృద్ధిచెంది రూ.737 కోట్ల నుంచి రూ.934 కోట్లకు పెరిగింది.
హైదరాబాద్‌లో కేంద్ర కార్యాలయం
నెస్లే, డాక్టర్ రెడ్డీస్ ఏర్పాటుచేసే జాయింట్ వెంచర్ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఏర్పాటవు తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయ త్రైమాసికంలో జేవీ కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. మా బ్రాండ్లను వినియోగదారుల కు చేరువ చేయడానికి జేవీ తోడ్పతుందని నెస్లే ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ సురేశ్ నారాయణన్ చెప్పారు. ఈ వినూత్న ప్రయో గం ద్వారా ఇరువురి భాగస్వాము ల బలాల్ని పరస్పరం అందిపుచ్చుకునే వీలు కలుగుతుందని, విని యోగదారులకు అందుబాటు ధరలతో చేరువ అవతుందన్న ఆశా భావాన్ని డాక్టర్ రెడ్డీస్ సీఈవో (ఇండియా, ఎమర్జింగ్ బ్రాండెడ్ మార్కెట్స్) ఎంవీ రమణ వ్యక్తం చేశారు.