calender_icon.png 3 January, 2026 | 6:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వొడాఫోన్ ఐడియాకు ‘కొత్త జీవితం’

26-04-2024 12:18:50 AM

n ఎఫ్‌పీవో సక్సెస్‌పై కుమారమంగళం బిర్లా

ముంబై, ఏప్రిల్ 25: ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో) ద్వారా రూ.18,000 కోట్లు సమీకరించడంతో వొడాఫోన్ ఐడియాకు ‘కొత్త జీవితం’ లభించినట్లయ్యిందని ఆదిత్యాబిర్లా గ్రూప్ చైర్మన్ కుమారమంగళం బిర్లా వ్యాఖ్యానించారు. ఎఫ్‌పీవో లిస్టింగ్ ఉత్సవం సందర్భంగా బిర్లా మీడియాతో మాట్లాడుతూ టెలికం రంగంలో నెలకొన్న తీవ్రపోటీ కారణంగా చందాదారుల్ని నిలుపుకోవడానికి ఇబ్బంది పడుతు న్న కంపెనీ ఇక నుంచి 5జీ సర్వీసుల్ని ప్రారంభించడం, నెట్‌వర్క్‌ను పెంచుకోవడంపై దృష్టి నిలుపుతుందన్నారు. తాజా మూలధన సమీకరణతో కంపెనీ సమస్యలు చాలావరకూ తీరినట్లేనా అన్న ప్రశ్నకు అవునంటూ బిర్లా స్పందించారు. కేంద్ర ప్రభు త్వం ఇచ్చిన ప్యాకేజీతో కంపెనీ ఇంతవరకూ ప్రయాణం చేయడానికి సహకరించిందని, టెలికాం మార్కెట్ మూడు ప్రైవేట్ కంపెనీలతో పోటీతత్వంతో కొనసాగడానికి వీలుప డిందని బిర్లా వివరించారు.

వొడాఫోన్ ప్రమోటర్లయిన వోడాఫోన్, ఆదిత్యా బిర్లా గ్రూప్‌లు ఇప్పటివరకూ రూ.1.70 లక్షల కోట్లకుపైగా పెట్టుబడి చేశాయని, గత ఐదేండ్లలోనే రూ.30,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిన ట్టు వెల్లడించారు. వొడాఫోన్ ఐడియా ఎఫ్‌పీవోను ‘వీఐ 2.0’గా బిర్లా అభివర్ణించారు. ఆఫర్ ద్వారా సమీకరించిన నిధుల్ని వ్యాపారంలో పెట్టుబడి చేస్తామని, ఇది వృద్ధికి బాట వేస్తుందన్నారు. 140 కోట్ల జనాభా ఉన్న దేశానికి మూడు ప్రైవేటు టెలికాం కంపెనీలు అవసరమని అంటూ 21.5 కోట్ల మందికి సేవలందిస్తున్న వొడాఫోన్ ఐడి యా ఒక జాతీయ ఆస్తి అని చెప్పారు. ఇందూస్ టవర్స్‌లో ఐడియా వాటా విక్రయంపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. 

రికార్డు స్థాయిలో 400 కోట్ల             షేర్ల ట్రేడింగ్..

టెలికం కంపెనీ వొడాఫోన్ ఐడియా ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్ (ఎఫ్‌పీవో)లో కేటాయింపు జరిగిన షేర్లు గురువారం మార్కెట్లో ప్రవేశించిన నేపథ్యంలో ఆ కౌంటర్లో రికార్డు పరిమాణంలో షేర్లు ట్రేడయ్యాయి. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో కలిపి 400 కోట్ల వొడాఫోన్ ఐడియా షేర్లు చేతులు మారాయి. ఏప్రిల్ 2౪న 195 కోట్ల ట్రేడింగ్‌తో ఇదే కంపెనీ సృష్టించిన చరిత్రను తాజాగా అధిగమించింది. స్టాక్ మార్కెట్ చరిత్రలో ఒకరోజులో ఇంత అధిక ట్రేడింగ్ పరిమాణం నమోదుకావడం ఇదే ప్రథ మం. ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 6 శాతం పెరిగి రూ.13.90 వద్ద ముగిసింది. 

ఎఫ్‌పీవోకు నిర్ణయించిన అప్పర్ ప్రైస్‌బ్యాండ్‌తో పోలిస్తే 25 శాతం లాభంతో ముగియడం గమనార్హం. ఇంట్రాడేలో వొడాఫోన్ ఐడి యా షేరు రూ.11.90 మధ్య విస్త్రతశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యింది. వోడాఫోన్ ఐడియా మొత్తం 1,260 కోట్ల షేర్లను జారీచేయగా అందేసరికి 8,012 కోట్ల  షేర్లు బిడ్ అయ్యాయి. ఆఫర్‌లో సంస్థాగత ఇన్వెస్టర్లు జోరుగా పాల్గొన్నారు. సంస్థల కోసం రిజర్వ్ చేసిన షేర్లకు దాదాపు 17 రెట్లు బిడ్ చేశాయి. ప్రముఖ ఫండ్స్ మద్దతుతో విజయవంతంగా ఎఫ్‌పీవోను పూర్తిచేయడంతో వొడాఫోన్ ఐడియా పట్ల ఇన్వెస్టర్ల ఆసక్తి నెలకొన్నదని మార్కెట్ నిపుణులు తెలిపారు.