26-04-2024 12:15:21 AM
తాజాగా ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 శాతంపైగా ర్యాలీ జరిపి నూతన రికార్డుస్థాయి రూ.810 వద్ద నిలిచింది. సెన్సెక్స్ బాస్కెట్‌లో అన్నింటికంటే అధికంగా యాక్సిస్ బ్యాంక్ 6 శాతం జంప్‌చేసింది. జేఎస్‌డబ్ల్యూ స్టీల్, నెస్లే, సన్‌ఫార్మా, ఐటీసీ, ఎన్టీపీసీ, మహీం ద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ 2 శాతం మధ్య పెరిగాయి. మరోవైపు ఆర్బీఐ నియంత్రణ ల బారినపడ్డ కోటక్ మహీంద్రా బ్యాంక్ 10.85 శాతం పతనమయ్యిం ది. బలహీన ఫలితాల్ని వెల్లడించిన హిందుస్థాన్ యూనీలీవర్‌తో పాటు టైటాన్, బజాజ్ ఫైనాన్స్, మారుతి, ఏషియన్ పెయింట్స్ 2 శాతం వరకూ తగ్గాయి. వివిధ రంగాల సూచీల్లో అన్నింటికంటే అధికంగా సర్వీసెస్ ఇండెక్స్ 1.71 శాతం పెరిగింది. మెటల్ ఇండెక్స్ 1.16 శాతం, హెల్త్‌కేర్ ఇండెక్స్ 0.97 శాతం, పవర్ ఇండెక్స్ 0.94 శాతం, ఎనర్జీ ఇండెక్స్ 0.87 శాతం చొప్పున పెరిగాయి. కన్జూమర్ డ్యూరబుల్స్, రియల్టీ ఇండెక్స్‌లు నష్టపో యాయి. బీఎస్‌ఈ స్మాల్‌క్యాప్ ఇండె క్స్ 0.54 శాతం, మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.71 శాతం చొప్పున పెరిగాయి.