calender_icon.png 24 January, 2026 | 2:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి

24-01-2026 12:00:00 AM

తెలంగాణ అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్‌రెడ్డి

ముషీరాబాద్, జనవరి 22 (విజయక్రాంతి): భారత స్వాతంత్య్ర సమరయోధు డు, సాయుధ పోరాటం ద్వారా ఆంగ్లేయులను దేశం నుంచి తరిమి కొట్టవచ్చునని నమ్మి, అది ఆచరణలో ఆజాద్ హింద్ ఫౌజ్ ఏర్పాటు చేసి భారత స్వాతంత్య్రాన్ని ప్రకటించిన మొదటి వ్యక్తి మన నేతాజీ అని తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ మాజీ సభ్యుడు,

అడ్వకేట్ జేఏసీ కన్వీనర్ పులి గారి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు శుక్రవారం కవాడిగూడలోని ఇంగ్లీష్ యూనియ న్ హైస్కూల్లో నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ పి. స్వర్ణలత,  ఉపాధ్యాయులు,  విద్యార్థులు పాల్గొన్నారు.