24-01-2026 12:00:00 AM
మేడిపల్లి, జనవరి 23 (విజయక్రాంతి); బోడుప్పల్ సర్కిల్ లోని శ్రీ సోమవంశ క్షత్రియ నకాష్ కులస్తుల కులదేవత అయిన శ్రీ మాతా నిమిషాంబ దేవి ఆలయము, బోడుప్పల్, సంచాలితము శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా సంస్థానము, హంపి పీఠం ఆధ్వర్యంలో చదువుల తల్లి శ్రీ సరస్వతి దేవి జన్మదినం, శ్రీ వసంత పంచ మి సందర్భంగా శ్రీ మాతా నిమిషాంబ దేవి అమ్మవారు విశేష అలంకరణలో మానవులకి సకల విద్యల్ని ప్రసాదించి, వారిలో జ్ఞాన దీపాలను వెలిగించే విద్యాశక్తి సరస్వతి, త్రిశక్తుల్లో ఒక మహాశక్తి రూపంలో దర్శన భాగ్యం కల్పించారు.
అనంతరం భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు, అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో ఆలయ చైర్మన్ శ్రీ కామరౌతు వినో ద్ కుమార్, ప్రధాన కార్యదర్శులు శ్రీ కె. అశోక్ కుమార్, సంగు శ్రీనివాస్, కోశాధికారి ఎన్. రమేష్ , రాష్ట్ర నకాష్ సంఘం ప్రధాన కార్యదర్శి కొరిచెర్ల శ్రీనివాస్ రావు,ట్రస్ట్ ధర్మకర్తలు బి. హిమచందర్, డి. నర్సింగ్ రావు, ఎమ్. శ్రీనివాస్ రావు, ఎమ్. సాయి బాబా, ఎన్. శ్రీకాంత్, వై.చంద్రశేఖర్, ఎన్. మోహ న్, డి. సతీష్, రామగిరి శ్రీకాంత్, ఎన్.రామకృష్ణ, డి.రామక్రిష్ణ, ఎన్. శ్రీధర్, వెంకట్ రాజారావు, కె. ప్రవీణ్ కుమార్, డి. నరేష్, వై. సత్యనారాయణ ఆల య అర్చకులు చంద్రశేఖర్ శర్మ, ఉమకాంత్ శర్మ, పిల్లలు, మహిళ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.