calender_icon.png 24 January, 2026 | 3:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజగోపాల్‌పేటలో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల చైతన్యం

24-01-2026 02:07:48 PM

నంగునూరు,విజయక్రాంతి: సిద్దిపేట పోలీస్ కమీషనరేట్ పరిధిలోని రాజగోపాల్‌పేట పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా రోడ్డు భద్రతపై శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాజగోపాల్‌పేట నుండి పాలమాకుల వరకు పోలీసుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు.వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని,అతివేగం,మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల కలిగే ప్రాణాపాయం గురించి ఎస్ఐ వివరించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ఆయన కోరారు.