22-07-2024 10:29:14 AM
హైదరాబాద్: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాంకాళి బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. మహంకాళి ఆలయంలో రెండో రోజు భక్తుల రద్దీ కొనసాగుతోంది. బోనాల ఉత్సవాల్లో భాగంగా రంగం కార్యక్రమం కొనసాగుతోంది. భక్తురాలు స్వర్ణలత అమ్మవారి ఎదుట భవిష్యవాణి వినిపిస్తున్నారు. బోనాలు ఎవ్వరూ ఎత్తుకొచ్చిన సంతోషంగా అందుకుంటానని చెప్పారు. పంటలు బాగా పండుతాయి, వర్షాలు సమృద్ధిగా కురస్తాయన్నారు. వ్యాధులు రాకుండా కాపాడతానని వెల్లడించారు. ప్రజలందరినీ కంటికి రెప్పలా కాపాడుకుంటా రంగం కార్యక్రమంలో స్వర్ణలత తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు.
బోనాల ఉత్సవాల్లో జోగిని శ్యామల మాట్లాడుతూ... 32 ఏండ్లలో కనీవినీ ఎరుగనంత ఆనందాన్ని పొందాను. శివశక్తులకు,జోగినిలకు మొట్ట మొదటిసారి పసుపుకుంకుమలతో ఆడపడుచులాగా గౌరవం దక్కింది. శివశక్తుల ఇబ్బందులను సిఎం గుర్తించి దూరం చేశారు. ఉజ్జయిని మహంకాళిఅమ్మవారి బోనాల పండుగలో జోగిని శ్యామల సిఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.