calender_icon.png 21 August, 2025 | 8:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బంగారు మైసమ్మ ఆలయ నూతన కమిటీ ఏర్పాటు

21-08-2025 06:30:48 PM

మేడిపల్లి: బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రముఖ బంగారు మైసమ్మ ఆలయానికి నూతన పాలక మండలిని ఎన్నుకున్నారు. పిసిసి ఉపాధ్యక్షుడు వజ్రెష్ యాదవ్(TPCC Vice President Vajresh Yadav) నేతృత్వంలో సమావేశం ఏర్పాటు చేసుకొని బోడుప్పల్ గ్రామ పరిధిలోని అన్ని కులాల ప్రతినిధులు, గ్రామ కమిటీ పెద్దలు నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేశారు. గ్రామంలోని బంగారు మైసమ్మ, నల్ల పోచమ్మ, శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయాలకు కలిపి ఈ ఉమ్మడి కమిటీ పని చేస్తుందని, పాలకవర్గం నూతన అధ్యక్షుడిగా బొబ్బల లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శులుగా వీరారెడ్డి, వీరాచారి, కోశాధికారిగా నర్సింగరావు గుప్తా, ఉపాధ్యక్షులుగా బాలిరెడ్డి, రమేష్, కార్యదర్శులుగా కుమార్, సత్యమూర్తి, బలరాం, కార్యనిర్వాహక కార్యదర్శిగా మహేందర్ యాదవ్, ఉప కోశాధికారులుగా చంద్రారెడ్డి, ప్రభాకర్ రెడ్డి ఎంపికయ్యారు.

ఈ నూతన పాలకవర్గం రెండు సంవత్సరాలు పాటు కొనసాగుతుందని ప్రతినిధులు తెలిపారు. ఎన్నిక అనంతరం అమ్మవారి సన్నిధిలో నూతన ప్రతినిధులు ప్రమాణ స్వీకారం చేశారు.  ఎంతో చారిత్రక నేపథ్యం ఉన్న బంగారు మైసమ్మ అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయడంతో పాటు ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి కృషి చేస్తామని నూతన పాలకవర్గం ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ అజయ్ యాదవ్, డిప్యూటీ మేయర్ స్రవంతి కిషోర్ గౌడ్, నగర ప్రముఖులు ,వివిధ కులాల ప్రతినిధులు, తదితరులు  పాల్గొన్నారు.