27-11-2025 12:00:00 AM
అధ్యక్షుడిగా కురువెళ్ల ప్రవీణ్‌కుమార్
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): చాంబర్ ఆఫ్ కామర్స్ నూతన కా ర్యవర్గాన్ని బుధవారం ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కురువెళ్ళ ప్రవీణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శిగా సోమ నరసింహారావు(జీవై నరేష్), ఉపాధ్యక్షులుగా బత్తిని నరసింహారావు(బిఎన్), సహాయ కార్యదర్శిగా బాదె రమే ష్(రవి), కోశాధ్యక్షులుగా తల్లాడ రమేష్, సెంట్రల్ ఈసీ సభ్యులుగా మాటేటి కిరణ్ కుమార్, రాయపూడి రవికుమార్, వంగవీటి హరీష్, సుఖాసి శేషగిరిరావు, పోట్ల రామనాథం పదవీ బాధ్యతలు స్వీకరించారు.
ఈ కార్యక్రమంలో చాంబర్ ఆఫ్ కామర్స్ మాజీ అధ్యక్షుడు చిన్ని కృష్ణారావు, కొప్పు నరేష్ కుమార్, మాజీ ప్రధాన కార్యదర్శులు మెంతుల శ్రీశైలం, గుర్రం ఉమామహేశ్వర రావు, భద్రాద్రి బ్యాంక్ చైర్మన్ చెరుకూరి కృష్ణమూర్తి, అన్ని శాఖల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.