calender_icon.png 16 July, 2025 | 7:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను కలిసిన నూతన గురుద్వారా కమిటీ

15-07-2025 10:02:34 PM

కరీంనగర్,(విజయక్రాంతి): కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ను మంగళవారం రోజున కరీంనగర్ గురుద్వారా నూతన కమిటీ మెంబర్స్  మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ గురుద్వార నూతన అధ్యక్షులుగా నియమితులైన సర్దార్ హర్మిందర్ సింగ్, జనరల్ సెక్రెటరీ సర్దార్ యస్పాల్ సింగ్ లకు శుభాకాంక్షలు తెలియజేసి సన్మానించారు. గురుద్వారా నూతన కమిటీ  అధ్యక్ష కార్యదర్శులు సిక్కు కమ్యూనిటీ , గురుద్వారా సమస్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారు . సాధ్యమైనంతవరకు సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానని బండి సంజయ్ కుమార్ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.