01-08-2025 12:13:03 AM
-పెండింగ్ చలానులు చెల్లించాలని వాహనదారులపై ఒత్తిడి
-ఎస్పీ పేరిటా వసూళ్లు
-కామారెడ్డిలో 44వ జాతీయ రహదారిపై ముగ్గురు కానిస్టేబుల్స్ తీరిది
కామారెడ్డి, జూలై 31 (విజయ క్రాంతి), కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 44 వ జాతీయ రహదారిపై ముగ్గురు కానిస్టేబుల్స్ హంగామా చేశారు. నిబంధనలను తుంగలో తొక్కి ఎస్పి పేరు చెప్తూ పెండింగ్ చాలండి చెల్లించాలని లేకపోతే వాహనాన్ని సీజ్ చేస్తామని బెదిరించారు. చాలా వాహనాలు కుటుంబ సభ్యులతో పేషంట్లతో పిల్లలు వృద్దులతో వెళ్లే వాహనాల ఆపడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
చాలామంది దగ్గర డబ్బులు లేకపోయినా గూగుల్ పే ఫోన్ పే లాంటి ద్వారా డబ్బులు తెప్పించుకుని పెండించాలని చెల్లించారు. చాలా చెల్లించిన వారిని కానిస్టేబుల్స్ వాహనాలను వదిలారు. చెల్లించని వారి వాహనాలను గంటల తరబడి 44 జాతీయ రహదారి పైనే నిలబెట్టారు. 44వ జాతీయ రహదారిపై అడ్డంగా నిలబడి వానాలను ప్రమాదకరంగా ఆపుతుండడంతో దాదాపు 80 కిలోమీటర్ల వేగంతో వెనకాల వచ్చే వాహనాలు ఢీకొట్టే ప్రమాదము ఉన్న కానిస్టేబుల్స్ పట్టించుకోలేదు.
ఇలా ప్రమాదకరంగా వాహనాలను ఆపవచ్చా అని వాహనదారులు అడిగితే, ఆ మాత్రం డ్రైవింగ్ రాకుండా హైవేల డ్రైవింగ్ ఎలా చేస్తారంటు దబాయించి మరి చాలాన్లు వసూలు ఫోటోలు వీడియోలు తీస్తున్న విజయ క్రాంతి ప్రతినిధిని మా పర్సనల్ ఫోటో లేదు ఎలా తీస్తావ్ అంటూ బెదిరించడం గమనర్వం. ఐడియా ఎస్‌ఐ,సిఐ లేకుండా కానిస్టేబుల్స్ ఇలా చలాన్లు వసూలు చేయొచ్చా అంటే. ఎస్పీ సార్ చేయమన్నాడని చెప్పడం గమనార్వం.
ఈ విషయంపై ట్రాఫిక్ ఎస్‌ఐ మహేష్ ను విజయ క్రాంతి ప్రతినిధి వివరణ కోరెందుకు ఫోన్ చేస్తే సమాధానం ఇవ్వలేదు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 44వ జాతీయ రహదారిపై నిబంధనలకు విరుద్ధంగా కానిస్టేబుల్స్ చాలాన్స్ వసూలు చేయడం వాహన దారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. జాతీయ రహదారిపై వాహనాలను ఆపడం వల్ల ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు ఆ శాఖ ఉన్నతాధికారులకు తెలియాలి. ఏ మేరకు స్పందిస్తా రో వేచి చూడాల్సిందే.