19-06-2024 12:05:00 AM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా పేదలకు ఇచ్చిన హామీలను మాత్రం నెరవేర్చడం లేదు. అధికారంలోకి రాగానే ఆసరా పెన్షన్లను పెంచుతామని నమ్మ బలికిన కాంగ్రెస్ ఆరునెలలైనా ఆ ఊసే లేదు. దీంతో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఆవేదన చెందుతున్నారు. పీసీసీ ప్రెసిడెంట్, ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎన్నికల ప్రసంగాలలో మన పాలన రాగానే రూ. 4 వేలు పింఛను ఇస్తామని ప్రకటించారు.
కొత్త పింఛన్ల మంజూరుపై కూడా మాట్లాడటం లేదు. అర్హులైన వారు ప్రజాపాలన అభయహస్తం కార్యక్రమంలో భాగంగా దరఖాస్తు చేసుకొని ఐదు నెలలైంది. ‘గత కేసీఆర్ ప్రభుత్వం ఇంట్లో వృద్ధులకు ఒక్కరికే ఇస్తుంది, కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇద్దరికీ ఇస్తామని’ కూడా అన్నారు. కొత్త పింఛన్ల మంజూరు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలి.
గుండమల్ల సతీష్ కుమార్