31-12-2025 07:09:50 PM
వాంకిడి(విజయక్రాంతి): మండలంలోని బంబార గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీ, బారెగూడ ప్రాంతాల్లో గత నెల రోజులుగా పనిచేయని చేతిపంపులకు బుధవారం మరమ్మత్తులు చేపట్టారు.గ్రామ సర్పంచ్ బెండరే కృష్ణాజీ, ఉప సర్పంచ్ జాడి సంతోష్ ఆధ్వర్యంలో చేతిపంపులను సరిచేసి తాగునీటి సరఫరాను పునరుద్ధరించారు. చేతిపంపులు పనిచేయక తాగునీటి కోసం ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గ్రామస్తులు తెలిపారు. విషయం తెలుసుకున్న గ్రామ పాలకవర్గం వెంటనే స్పందించి సంబంధిత సిబ్బందితో మరమ్మత్తులు చేయించి సమస్యకు పరిష్కారం చూపిందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.గ్రామంలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటామని సర్పంచ్ తెలిపారు.