11-10-2025 12:00:00 AM
ముంబై, అక్టోబర్ 10: టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఆస్ట్రేలియా టూర్‌కు సన్నద్ధమవుతున్నాడు. సొంత నగరం ముంబైలో ముమ్మరకంగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. స్థానిక శివాజీ పార్క్ నెట్స్‌లో మూడు గంటల రాటు సాధన చేశాడు. లోకల్ బౌలర్లను ఎదుర్కొంటూ భారీ షాట్లను ఆడాడు. రోహిత్ ప్రాక్టీస్‌ను చూసేందుకు అభిమాను లు భారీగా తరలివచ్చారు.అక్టోబర్ 19 నుంచి ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ జరగనున్న నేపథ్యంలో రోహిత్ రీఎంట్రీ ఇవ్వనున్నాడు.
చాంపియన్స్ ట్రోఫీ తర్వాత రోహిత్ గ్రౌండ్‌లో అడుగుపెట్టడం అదే తొలిసారి. ఇప్పటికే టీట్వంటీలకు, టెస్ట్ ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన హిట్ మ్యాన్ వచ్చే 2027 ప్రపంచ కప్‌లో ఆడడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. దీని కోసం ఫిట్‌నెస్‌పై ఫోకస్ పెంచి 10 కిలోల బరువు కూడా తగ్గి స్లిమ్ అయ్యాడు. ఆసీస్ టూర్ తర్వాత విజయ్ హజారే ట్రోఫీలోనూ రోహిత్ ఆడే అవకాశాలున్నాయి.