31-12-2024 12:03:44 AM
లంకపై 45 పరుగులతో విజయం
మౌంట్ మాంగనూయ్: స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టీ20 సిరీస్‌ను ఆతిథ్య న్యూజిలాండ్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2 కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన రెండో టీ20లో న్యూజిలాండ్ 45 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. మార్క్ చాప్‌మన్ (42) టాప్ స్కోరర్‌గా నిలవగా.. చివర్లో మిచెల్ హే (19 బంతుల్లో 41 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. లంక బౌలర్లలో హసరంగా 2 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.1 ఓవర్లలో 141 పరుగులకు ఆలౌటైంది. పెరీరా (48) పర్వాలేదనిపించాడు. కివీస్ బౌలర్లలో జాకబ్ డఫీ 4 వికెట్లతో మెరిశాడు. మిచెల్ హేకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య మూడో టీ20 జనవరి 2న జరగనుంది.