calender_icon.png 20 November, 2025 | 6:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆఫ్గన్, జింబాబ్వే టెస్టు డ్రా

31-12-2024 12:06:41 AM

డబుల్ సెంచరీలతో మెరిసిన రహమత్, షాహిది

బులవాయో: జింబాబ్వే, అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన తొలి టెస్టు డ్రాగా ముగిసింది. చివరి రోజు ఆట ముగిసే సమయానికి జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 34 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఓపెనర్ బెన్ కర్రన్ (41) టాప్ స్కోరర్‌గా నిలవగా.. సీన్ విలియమ్స్ (35*) రాణించాడు. అంతకముందు అఫ్గానిస్థాన్ తొలి ఇన్నింగ్స్‌లో 699 పరుగులకు ఆలౌటైంది. రహమత్ షా (424 బంతుల్లో 234), కెప్టెన్ హజ్మతుల్లా షాహిది (474 బంతుల్లో 246) డబుల్ సెంచరీలతో మెరిశారు. వికెట్ కీపర్ అఫ్సర్ జజయ్ (113) శతకంతో కదం తొక్కాడు. ఆఫ్గన్‌కు టెస్టుల్లో ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. జింబాబ్వే బౌలర్లలో బ్రియాన్ బెన్నెట్ 5 వికెట్లతో మెరవగా.. సీన్ విలియమ్స్ 2 వికెట్లు పడగొట్టాడు. హజ్మతుల్లాకు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరుజట్ల మధ్య రెండో టెస్టు జనవరి 2 నుంచి మొదలుకానుంది.