24-01-2026 12:51:28 AM
సదాశివపేట, జనవరి 23 : సదాశివపేటకు చెందిన 4వ వార్డులోని ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులకు సరిఫికెట్లను టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి శుక్రవారం పంపిణీ చేశారు. అలాగే ఫర్వీన్ సుల్తానా ఖాజాపాషా ల ఇంటిని నిర్మల జగ్గారెడ్డి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు మునిపల్లి సత్య నారాయణ, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిరు, కాంగ్రెస్ నాయకులు పిల్లోడి విశ్వనాథం, ఇందిరమ్మ కమిటీ వార్డు ఇన్చార్జిలు మోహిస్, ముస్తఫా, శరత్, సజ్జి, శంకర్ గౌడ్, కొత్త గొల్ల చంద్రశేఖర్, పట్నం సుభాష్ , గుండు రవి, అరుణ్, వీరన్న, కాంగ్రెస్ నాయకులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు.