calender_icon.png 19 November, 2025 | 5:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అరుదైన రికార్డ్.. శతకం బాదిన నితీష్ కుమార్

28-12-2024 12:06:29 PM

Border–Gavaskar Trophy 2024: ఆస్ట్రేలియా- టీమిండియా జట్ల మధ్య బాక్సింగ్ డే టుస్టు(Boxing day test) మెల్ బోర్న్ వేదికగా జరుగుతోంది. మూడోరోజు ఆట కొనసాగుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ఆస్ట్రేలియా 474 పరులుగు చేసింది. మెల్‌బోర్న్ టెస్టులో నితీష్ కుమార్ రెడ్డి(Nitish Kumar Reddy) సెంచరీ పూర్తి చేశాడు. 171 బంతుల్లో నితీష్ కుమార్ (103) శతకం బాదాడు. ఎనిమిదో స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నితీష్ అరుదైన రికార్డ్ సొంతం చేసుకున్నాడు. భారత్ తొలి ఇన్సింగ్స్ స్కోర్ 354/9.. 120 పరుగుల ఆధిక్యంలో ఆస్ట్రేలియా కొనసాగుతోంది. శనివారం జరిగిన బాక్సింగ్ డే టెస్ట్‌లో నితీష్ కుమార్ రెడ్డి ఒత్తిడిలో ఆకట్టుకునే నాక్‌ని అందించాడు. టెస్ట్ క్రికెట్‌లో తన తొలి అర్ధ సెంచరీని చేరుకున్న సందర్భంగా ఇటీవల విడుదలైన చిత్రం 'పుష్ప-2 స్టైల్ లో ఫోజు ఇచ్చాడు. నితీస్ కుమార్ పుష్ప స్టైల్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.