calender_icon.png 20 November, 2025 | 2:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చెవిరెడ్డి కుటుంబ ఆస్తులు జప్తు

20-11-2025 12:03:01 AM

ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్

అమరావతి, నవంబర్ 19: మద్యం కుంభకోణంలో వైఎస్‌ఆర్‌సీపీ నేత చెవిరెడ్డి భార్కర్‌రెడ్డి ఆస్తుల జప్తునకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఆయన కుటుంబ ఆస్తు ల జప్తునకు కూడా అనుమతి ఇచ్చింది. ఈ స్కామ్‌లో నిందితుల ఆస్తుల జప్తు ప్రక్రియ కొనసాగుతోంది. భాస్కర్‌రెడ్డి, మోహిత్‌రెడ్డి, హర్షిత్‌రెడ్డి, కేవీఎస్ ఇన్‌ఫ్రా ఎండీ చెవిరెడ్డి లక్ష్మిపేరుతో ఉన్న ఆస్తులను జప్తు చేయాలని ఆదేశాలిచ్చింది.

చెవిరెడ్డి కుటుంబం అక్రమంగా, కమీషన్ల రూపంలో భారీగా ఆస్తులు గడించినట్లు సిట్ గుర్తించింది. రూ.54.87కోట్లను నల్లధనంగా మార్చినట్లు గుర్తించింది. తిరుపతి, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వారికి చెందిన పలు ఆస్తుల జప్తునకు ఆదేశించింది. తదుపరి చర్యలు తీసుకోవాలని డీజీపీని ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు హోం శాఖ ముఖ్యకార్యదర్శి కుమార్ విశ్వజిత్ బు ధవారం ఉత్తర్వులు జారీ చేశారు.