calender_icon.png 9 January, 2026 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నో హెల్మెట్.. నో ఫ్యూయల్

07-01-2026 12:00:39 AM

  1. ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరి 

పెట్రోల్ బంక్ యజమానులతో జిల్లా ఎస్పీ డి.జానకి

మహబూబ్ నగర్, జనవరి 6 (విజయక్రాంతి): జాతీయ రోడ్డు భద్రతా మాసోత్స వాల్లో  మంగళవారం మహబూబ్నగర్ టౌన్ పరిధిలోని పెట్రోల్ బంక్ యజమానులతో ట్రాఫిక్ పోలీస్‌స్టేషన్లో ప్రత్యేక సమా వేశం నిర్వహించారు.  ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ భగవంత్‌రెడ్డి మాట్లాడుతూ హెల్మెట్ ధరించకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయకూడదని పెట్రోల్ బంక్ యజమానులకు సూచించారు.

హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణ రక్షణ సాధ్యమవుతుందని, రోడ్డు ప్రమాదాల్లో తలగాయాల వల్ల జరిగే మృతులను గణనీయంగా తగ్గించవచ్చని ఆయన వివరించారు. నో హెల్మెట్  నో ఫ్యూయల్ అనే నినాదంతో అన్ని పెట్రోల్ బంకుల్లో స్పష్టమైన బోర్డులు ఏర్పాటు చేసి, ఇకపై హెల్మెట్ లేకుండా వచ్చిన ద్విచక్ర వాహనదారులకు పెట్రోల్ పోయరాదని పెట్రోల్ బంక్ యజమానులకు స్పష్టమైన సూచనలు చేశారు. 

ద్విచక్ర వాహనదారుల్లో అవగాహన పెరిగి రోడ్డు భద్రత మరింత మెరుగుపడుతుందని తెలిపారు. ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ప్రతి పౌరుని బాధ్యత అని, ప్రజల భద్రత దృష్ట్యా పెట్రోల్ బంక్ యజమానులు పోలీస్ శాఖకు సంపూర్ణంగా సహకరించాలని కోరారు.  ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది, పెట్రోల్ బంక్ యజమానులు పాల్గొన్నారు.