calender_icon.png 4 May, 2025 | 6:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మధ్యవర్తులు అవసరం లేదు

03-05-2025 04:52:17 PM

నేరుగా నన్ను కలవవచ్చు...

జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్.. 

మహబూబాబాద్ (విజయక్రాంతి): పోలీసు శాఖ ప్రజలకు సేవ చేయడానికి ఉన్నదని, ప్రజలు తమ సమస్యలను అభ్యర్థనలను ఫిర్యాదులను నేరుగా పోలీస్ అధికారులకు తెలియజేసే హక్కు ఉందని, మధ్యవర్తుల ప్రమేయం, సిఫారసుదారుల జోక్యం అవసరం లేదని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్(District SP Sudhir Ramnath Kekan) అన్నారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ప్రజల అవసరాలను గౌరవించి పారదర్శకమైన విధానాలతో స్పందించడానికి కట్టుబడి ఉన్నామని చెప్పారు.

ప్రతిరోజు విధివిధానాల ప్రకారం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని ప్రజలు తమ సమస్యలను స్వయంగా చెప్పగలగడం ద్వారా సమస్యకు సత్వర పరిష్కారం లభిస్తుందన్నారు. మధ్యవర్తులు, ఇతరుల ప్రమేయం వల్ల సమస్యలను తప్పుగా లేదా వక్రీకరించి తెలియజేసే అవకాశం ఉందని, అలాకాకుండా ఎవరు కూడా భయాందోళన చెందకుండా నేరుగా పోలీసు అధికారులను, తనను సంప్రదించవచ్చని ఎస్పీ తెలిపారు. ప్రజలకు పోలీసులు స్నేహితులుగా ఉండే విధంగా వ్యవహరించడమే పోలీసుల లక్ష్యం అని పేర్కొన్నారు.