03-05-2025 04:54:41 PM
మందమర్రి (విజయక్రాంతి): పట్టణానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు తుంగపిండి రాంచందర్ 'కాక శ్రమశక్తి' అవార్డును అందుకున్నారు. మేడే ను పురస్కరించుకొని ఇటీవల హైదరాబాద్ లో నిర్వహించిన కార్యక్రమంలో కార్మిక వర్గానికి చేసిన సేవలకు గాను కాక స్మారక శ్రమశక్తి అవార్డు ను చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్బంగా రాం చందర్ మాట్లాడుతూ... అవార్డు రావడం సంతోషంగా ఉందన్నారు. ఇదిలా ఉండగా రాం చందర్ కు అవార్డు రావడం పట్ల ఆయన మిత్రులు సన్నిహితులు హర్షం వ్యక్తం చేశారు.