14-10-2025 12:00:00 AM
అక్టోబర్ 12 అనగానే మనకు గు ర్తొచ్చేది సమాచార హక్కు చ ట్టం. 20 ఏళ్ల క్రితం 2005లో చట్టంగా రూపాంతరం చెందిన సమాచార హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(ఎ) అయి న భావప్రకటన స్వేచ్ఛలో మాత్రం ఎక్కడా కనిపించదు. అందుకే సమాచార హక్కు స్పష్టంగా నిర్మించడం కోసం ఎన్నో పోరాటాలు చేయాల్సి వచ్చింది. 10 రూపాయ ల రిట్ పిటిషన్ వంటి శక్తివంతమైన అధికారం ఆర్టీఐ చట్టం కింద లభించింది. దీని ని సరిగ్గా వాడుకుంటే చాలా ఉపయోగాలుంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్ప నవసరం లేదు.
సామాన్యుల పాలిట ఆశాకిరణమైన సమాచార హక్కు చట్టం ఇవాళ జనానికి ఉపయోగపడకుండా పోతుందనే ఫిర్యాదులే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సతర్క్ నాగ్రిక్ సంఘటన్ (ఎస్‌ఎన్‌ఎస్) జనవరి 2025లో సంకలనం చేసి ప్రచురించిన ‘భారతదేశంలోని సమాచార కమిషన్ల నివేదిక 2023 ప్రకా రం జూన్ 30, 2024 నాటికి మొత్తం 29 కమిషన్లలో నాలుగు లక్షల కంటే ఎక్కువ అప్పీళ్లు, ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండ డం గమనార్హం.
దేశంలోని చాలా రాష్ట్రాల్లోని రాష్ట్ర సమాచార కమిషన్‌కు స్టేట్ చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్‌లను నియమించలేదు. రాష్ట్ర సమాచార కమిషన్లలో ఖాళీ అయిన భర్తీలను పూడ్చకుండా గాలికొదిలేస్తున్నారు. ఆర్టీఐ చట్టాన్ని బలహీనం చేసి పార్లమెంట్, పరస్పర విరుద్ధ తీర్పులతో న్యాయస్థానాల ఊపిరి తీసేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం ధోరణితో పారదర్శకత ను పర్యవేక్షించాల్సిన సమాచార సంస్థ మొత్తం తీవ్రమైన పక్షవాతానికి గురి కావా ల్సి వచ్చింది. 20 సంవత్సరాల దాకా ఆర్టీఐ కోసం పోరాడిన పారదర్శకత దెబ్బతింటూ వస్తున్నది.
లెక్కలేనన్ని అప్పీళ్లు, ఫిర్యాదులు
కేంద్ర సమాచార కమిషన్ మరోసారి ప్రధాన కమిషనర్ లేకుండా ఉంది. గత 11 ఏళ్లలో పారదర్శకతను పర్యవేక్షించే ఈ సం స్థలకు ప్రధాన కమిషనర్ లేకుండానే నడవడం ఇది ఏడవసారి.సెప్టెంబర్ 13, 2025న అప్పటి చీఫ్ సమాచార కమిషన ర్ హీరాలాల్ సమరియా పదవీ విరమణ చేసినప్పటి నుంచి, ఈ సంస్థ కేవలం ఇద్దరు కమిషనర్లతో మాత్రమే పనిచేస్తోంది. చీఫ్ సమాచార కమిషనర్ పదవి తో సహా మొత్తం తొమ్మిది పోస్టులు ఖాళీ గా ఉన్నాయి. దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తుంది.
దాదాపు 26 వేల అప్పీళ్లు, ఫిర్యా దులు పెండింగ్‌లో ఉన్నాయి. కొందరు దరఖాస్తుదారులు తమ దరఖాస్తులను విచారించడానికి ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం వేచి ఉండాల్సి వస్తుంది. ఇటువంటి జాప్యాలు సమాచార హక్కు (ఆర్టీఐ) చట్టం ఉద్దేశాన్ని దెబ్బతీస్తుంది. ప దవీ విరమణ తేదీలు పూర్తిగా తెలిసి కూ డా, ప్రభుత్వం కావాలనే నియామకాలు చేపట్టకుండా పారదర్శకతకు పాతరేస్తుంది. సీఐసీకి తాత్కాలిక చీఫ్ కమిషనర్‌ను నియమించడానికి ఆర్టీఐ చట్టంలో ఎటువంటి నిబంధన లేదు. ఆర్టీఐ చట్టం అనేది పౌరు లు పాలనలో పాల్గొనడానికి ఒక ముఖ్యమైన సాధనం. సుప్రీంకోర్టు ఆదేశాల ఉ ల్లంఘనలు, నియామకాల్లో జాప్యం స్ప ష్టంగా కనిపిస్తుంది.
సమాచార కమిషన్లలో పదవీ విరమణల తేదీలు ముందుగానే తెలిసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం సకాలంలో పోస్టులను భర్తీ చేయడంలో పదేపదే విఫలమవుతూనే వస్తున్నా యి. సమాచార కమిషన్లలో ఖాళీలను స కాలంలో భర్తీ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన సుప్రీంకోర్టు 2019 తీర్పును ప్రభుత్వం నేరుగా ఉల్లంఘించడమేనని అంజలి భరద్వాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (2019) కేసులో స్పష్టంగా ఉంది. ‘ఖాళీలు ఆర్టీఐ చట్టం పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తాయని, పైగా ఇది ఈ చట్టం అమల్లోకి రావడానికి ఉద్దేశించిన లక్ష్యాన్ని నిర్వీర్యం చేసినట్లవుతుందని’ సుప్రీంకోర్టు హెచ్చరించింది.
ప్రభుత్వ వైఫల్యం
అక్టోబర్ 2023లోనూ సమాచార కమిషన్లలో పోస్టులు భర్తీ చేయకపోతే ఆర్టీఐ చట్టం నిరుపయోగంగా మారే ప్రమాదం ఉందని సుప్రీంకోర్టు తెలిపింది. అయితే ఏప్రిల్ 2025 నాటికి సమాచార కమిషన్లలో నియామకాలు చేపడతామని చెప్పిన ప్రభుత్వం ప్రక్రియను పూర్తి చేయడంలో విఫలమైంది. ఈ నేపథ్యంలో సమాచార కమిషనర్లను నియమించకపోవడంపై గత నెల 26న సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చిల ధర్మాసనం ముందుకు ఒక కేసు విచారణకు వచ్చింది. పిటిషనర్ల తరపున వాదించిన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మునుపటి ఆదేశాలు ఉన్నప్పటికీ కేంద్ర సమాచార కమిషన్‌లో ఖాళీలు భర్తీ కాలేదని పేర్కొన్నారు.
కమిషన్‌లో కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారని.. 26,800 కంటే ఎక్కువ అప్పీళ్లు, ఫిర్యాదు లు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. దీనివల్ల విచారణలు ఒక సంవత్సరం కం టే ఎక్కువ ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. జూలై 2025లో బాత్రా దాఖలు చేసిన ఒక ఆర్టీఐ దరఖాస్తుకు ప్రతిస్పందనగా కేంద్రం డీవోపీటీ.. మే నుంచి ఛీఫ్ స మాచార కమిషనర్ పదవి కోసం 83 దరఖాస్తులు అందాయని, అంతకుముందు సెప్టెంబర్ 2024లో మరో ఆర్టీఐ దరఖాస్తు ద్వారా 161 దరఖాస్తులు అందినట్లు వెల్లడించింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికీ నియామకాలు మాత్రం పూర్తి చేయలేకపోయిందని బాత్రా పేర్కొన్నారు.
స్వతంత్రతకు ముప్పు
భారతదేశంలో 28 రాష్ర్ట సమాచార కమిషన్లు (ఎస్‌ఐసీలు) ఒక సీఐసీ ఉన్నా యి. ఆర్టీఐ చట్టం ప్రకారం ప్రతి కమిషన్ లో పనిభారం ఆధారంగా ఒక చీఫ్ సమాచార కమిషనర్, 10 సమాచార కమిషనర్లు ఉండాలని సూచిస్తుంది. జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ర్ట సహా చాలా రాష్ట్రాల్లో క మిషనర్ పోస్టులు ఖాళీగానే దర్శనమిస్తున్నాయి. సమాచార కమిషన్లలో ఖాళీలు భర్తీ కానప్పుడు ప్రజలకు అందాల్సిన సమచారం ఎలా అందుతుందనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. పారదర్శకత సంస్థలు ఆర్టీఐలకు సంబంధించిన సమాచారాన్ని ప్రచు రించడం లేదు. దీనివల్ల సీఐసీ, ఎస్‌ఐసీల్లో ఆర్టీఐ వినియోగం పూర్తిగా మరుగునపడిపోతున్నది.
ఆర్టీఐ చట్టంలోని సెక్షన్ 20 లోపభూయిష్ట ప్రజా సమాచార అధికారుల (పీఐవో)పై రూ. 25 వేల వరకు జరి మానా విధించే అధికారాన్ని సమాచార క మిషన్లకు ఇస్తుంది. ఒక ఆర్టీఐ దరఖాస్తు ను విస్మరించినా లేదా సమాచారాన్ని తిరస్కరించినా సదరు అధికారిపై జరిమానా విధించొచ్చు. అయితే సమాచార కమిషన్ల లో ఖాళీలు పూర్తయ్యే సమయానికి పీఐవోలు మారిపోవడం లేదా కమిషన్ పదవీ కాలం ముగియడం జరిగిపోతున్నాయి. దీ నివల్ల ఆర్టీఐ అమలు, జవాబుదారీతనం గాలిలో కలిసిపోతున్నాయి.కేంద్రం తీరు తో సమాచార కమిషనర్ల స్వతంత్రతకే ము ప్పు తలెత్తిందని, సమాచార హక్కు చట్టం ఉనికి ప్రమాదకరంగా మారిందన్న విమర్శలు పెరిగిపోయాయి.